AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ వార్త పక్కాగా చదవాల్సిందే

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడంతో ఇండియన్‌ రైల్వేస్‌ కూడా ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే ప్రస్తుతం ఓ నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌పై ఇండియన్‌ రైల్వేస్‌ వినియోగదారులకు హెచ్చరిక చేసింది. ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ అనే యాప్‌ నకిలీదని, దాన్ని డౌన్‌లోడ్‌ చేసి మోసపోవద్దని హెచ్చరికలు చేసింది. కచ్చితంగా వినియోగదారులు ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ వార్త పక్కాగా చదవాల్సిందే
IRCTC
Nikhil
|

Updated on: Aug 05, 2023 | 6:30 PM

Share

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అన్ని సేవలు ఇంట్లోనుంచి పొందే సదుపాయాలు పొందాయి. ముఖ్యంగా రైళ్లల్లో ప్రయాణించేందుకు గతంలో టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడంతో ఇండియన్‌ రైల్వేస్‌ కూడా ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. అయితే ప్రస్తుతం ఓ నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌పై ఇండియన్‌ రైల్వేస్‌ వినియోగదారులకు హెచ్చరిక చేసింది. ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ అనే యాప్‌ నకిలీదని, దాన్ని డౌన్‌లోడ్‌ చేసి మోసపోవద్దని హెచ్చరికలు చేసింది. కచ్చితంగా వినియోగదారులు ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. అయితే ఈ నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌ నుంచి ఎలా రక్షణ పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

కొంతమంది మోసగాళ్లు ఐఆర్‌సీటీసీ యూజర్లకు  భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారని ఐఆర్‌సీటీసీ అధికారులు హెచ్చరించారు. సాధారణ పౌరులను మోసగించడానికి నకిలీ ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని సూచిస్తుంది. ఐఆర్‌సీటీసీ లేటెస్ట్‌ యాప్‌ ఇదేనంటూ ఆ సందేశంలో ఉండడంతో చాలా మంది ఆ హానికరమైన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసకుంటారు. అయితే వినియోగదారులు కచ్చితంగా మోసగాళ్ల బారిన పడవద్దని అధికారులు ట్వీట్‌ ద్వారా హెచ్చరించారు. ముఖ్యంగా గూగుల్‌ ప్లే స్టోఆర్‌ లేదా అధికారి యాపిల్‌ స్టోర్‌ నుంచి ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఏప్రిల్ 2023లో కూడా వినియోగదారుల నుంచి సున్నితమైన డేటాను దొంగిలించడానికి స్కామర్‌లు ఉపయోగించే నకిలీ ఆండ్రాయిడ్‌ యాప్, సంబంధిత వెబ్‌సైట్ గురించి ఐఆర్‌సీటీసీ తన కస్టమర్లందరినీ అప్రమత్తం చేసింది. యాప్, వెబ్‌సైట్ నిజమైన IRCTC అప్లికేషన్, సైట్‌తో సారూప్యతను కలిగి ఉంటాయి. దీని వల్ల వినియోగదారులు వాటిని వేరు చేయడం కష్టమవుతుంది. ఐఆర్‌సీటీసీ కనెక్ట్‌ ఏపీకే పేరుతో నకిలీ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఫార్వార్డ్ అవుతుంది. ఐఆర్‌సీటీసీ నుంచి రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, యూపీఐ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో సహా సున్నితమైన నెట్ బ్యాంకింగ్ ఆధారాలను పొందేందుకు ఈ నకిలీ వెబ్‌సైట్‌, యాప్‌ను స్కామర్లు వాడుతున్నారు. ముఖ్యంగా సందేశాల ద్వారా ఏపీకే ఫైల్ లింక్‌ను వినియోగదారులకు పంపేవారు. అప్పుడు ఐఆర్‌సీటీసీ యూజర్ల అలెర్ట్‌ చేసింది. ముఖ్యంగా ఐఆర్‌సీటీ యాప్‌ అప్‌డేట్‌ను సందేశాల ద్వారా పంపదని వినియోగదారులు గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు