AI Tools: మీరు రోజూ వాడే టూల్స్‌లో ఈ ఏఐ ఫీచర్స్ ఉన్నాయని తెలుసా?

మనం రోజూ వాడే గూగుల్ డాక్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మీట్.. వంటి పలు గూగుల్ సాఫ్ట్‌వేర్స్‌లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఈ ఏఐ ఫీచర్ల ద్వారా ఆయా టూల్స్‌ను మరింత యూజ్ ఫుల్‌గా మార్చుకోవచ్చు. అదెలాగంటే..

AI Tools: మీరు రోజూ వాడే టూల్స్‌లో ఈ ఏఐ ఫీచర్స్ ఉన్నాయని తెలుసా?
Ai Tools

Updated on: Oct 06, 2025 | 6:03 PM

మనలో చాలామంది రోజూ గూగుల్‌కు సంబంధించిన టూల్స్ వాడుతూ ఉంటారు. ఆఫీస్ వర్క్ కోసం గూగుల్ షీట్స్,మీటింగ్ కోసం గూగుల్ మీట్.. ఫైల్స్ షేరింగ్ కోసం గూగుల్ డ్రైవ్.. ఇలా చాలారకాల గూగుల్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడుతుంటారు. అయితే ఈ గూగుల్ టూల్స్‌లో ఉన్న ఏఐ ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డ్రైవ్ స్పేస్ నిండకుండా..

గూగుల్ డ్రైవ్‌ను చాలామంది వాడుతుంటారు. యూజర్లు తమ పర్సనల్ ఫైల్స్, ఫొటోలు, వీడియోల వంటివి డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసుకుని దాచుకుంటుంటారు. అయితే డ్రైవ్‌లో స్పేస్ త్వరగా అయిపోవడం అనేది చాలామంది ఫేస్ చేసే సమస్య. దీనికి సొల్యూషన్‌గా డ్రైవ్‌లో ఫైల్స్‌ను నచ్చిన సైజుల్లో కంప్రెస్ చేసుకుని సేవ్ చేసుకునే ఫీచర్‌ రాబోతోంది.

మీటింగ్‌లో నోట్స్

వీడియో కాన్ఫరెన్స్, మీటింగ్స్ కోసం చాలామంది గూగుల్​ మీట్‌ను వాడుతుంటారు. అయితే ఈ మీటింగ్స్‌లో ఎప్పుడైనా నోట్స్ రాసుకోవాల్సి వస్తే.. ఇబ్బంది పడకుండా ‘టేక్ నోట్స్’ అనే ఏఐ ఫీచర్​ను తీసుకురాబోతోంది గూగుల్. ఈ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా రికార్డ్ అవుతున్న వాయిస్ నుంచి ఆటోమెటిక్‌గా నోట్స్ సేవ్ అయిపోతుంది.

గూగుల్ షీట్స్ టెంప్లేట్స్

డేటాను పట్టిక రూపంలో పొందుపరచేందుకు గూగుల్ షీట్స్ పనికొస్తాయి. అయితే ఇందులో సులభంగా డేటాను ఎంట్రీ చేసుకునే విధంగా గూగుల్ కొన్ని ఫార్మాట్స్‌ను తీసుకురానుంది. ఏఐ సాయంతో తయారయ్యే ఈ టెంప్లేట్స్‌తో డేటాను సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

జీమెయిల్‌లో రైటింగ్ టూల్

సింపుల్‌గా జీమెయిల్స్ రాసేందుకు వీలుగా గూగుల్ ‘హెల్ప్​ మీ టు రైట్’ అనే ఏఐ ఫీచర్‌‌ను తీసుకురాబోతోంది. ఈ టూల్ సాయంతో వాయిస్ ద్వారా లేదా కొన్ని వర్డ్స్ సాయంతో  స్పెల్లింగ్, గ్రామర్​​ మిస్టెక్స్ లేకుండా పూర్తి మెయిల్‌ను కంపోజ్ చేయొచ్చు.

చాట్‌లో లాంగ్వేజెస్

గూగుల్​ చాట్‌కు జెమిని ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది గూగుల్.  ఈ అప్‌డేట్ సాయంతో సుమారు 69 భాషల్లోకి ఆటోమేటిక్​గా మెసేజ్​లను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us