Instagram Tips: ఇన్‌స్టాగ్రమ్‌లో మీ ‘స్టోరీ’ని కొందరు మాత్రమే చూడాలా? ఈ ప్రైవసీ టిప్స్ ఫాలో అవ్వండి..

|

Jun 05, 2023 | 6:21 AM

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రమ్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఆకర్షణీయమైన ఫీచర్ల కోసం ఇష్టమైన వీడియో షేరింగ్, చాటింగ్ యాప్‌గా గుర్తింపు పొందిన ఇన్‌స్టాగ్రామ్.. వినియోగదారుల సౌలభ్యం కోసం అనేక ప్రైవసీ ఆప్షన్స్ అందిస్తోంది. ఇందులో, మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను మీకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

Instagram Tips: ఇన్‌స్టాగ్రమ్‌లో మీ ‘స్టోరీ’ని కొందరు మాత్రమే చూడాలా? ఈ ప్రైవసీ టిప్స్ ఫాలో అవ్వండి..
Instagram
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రమ్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఆకర్షణీయమైన ఫీచర్ల కోసం ఇష్టమైన వీడియో షేరింగ్, చాటింగ్ యాప్‌గా గుర్తింపు పొందిన ఇన్‌స్టాగ్రామ్.. వినియోగదారుల సౌలభ్యం కోసం అనేక ప్రైవసీ ఆప్షన్స్ అందిస్తోంది. ఇందులో, మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను మీకు నచ్చిన వ్యక్తులకు మాత్రమే షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే, మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది స్నేహితులు ఉంటే.. ఎంపిక చేసిన ఫాలోవర్స్‌కు మాత్రమే ఆ స్టోరీస్ చూసే వీలు ఉంటుంది. మరి ఆ ప్రైవసీ టిప్స్ ఏంటి? ఎలా సెట్ చేయాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. ముందుగా మీ Android లేదా iOS ఫోన్‌లో ఇన్‌స్టాగ్రమ్ యాప్‌ను తెరవండి.

2. స్క్రీన్ దిగువన ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. ప్రొఫైల్ పేజీ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

4. ఇక్కడ కనిపించే ఆప్షన్స్‌లో క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ పేజీలో మీకు కావాల్సిన స్నేహితులను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.

లాస్ట్ సీన్ కనిపించకుండా ఏం చేయాలి?

మీరు చాట్ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక చాటింగ్ చేస్తూ మీరు పంపిన మెసేజ్ వారు చూశారా? లేదా? అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు మెసేజెస్ చదివినట్లు అవతలి వారికి తెలియవద్దు అంటే.. అందుకు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. ముందుగా Android లేదా iOS పరికరంలో ఇన్‌స్టాగ్రమ్ యాప్‌ను తెరవాలి.

2. ఆపై కుడి ఎగువ మూలలో ఉన్న పేపర్ రాకెట్ గుర్తుపై క్లిక్ చేయండి.

3. ఇది ఇన్‌స్టాగ్రమ్ డీఎం విభాగం. ఇక్కడ మీరు చాట్ చేసిన వ్యక్తి లాస్ట్ టైమ్‌ను చూడొచ్చు.

4. అయితే, మీ లాస్ట్ సీన్‌ను ఎవరూ చూడొద్దు అంటే. సెట్టింగ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

5. ప్రొఫైల్ ట్యాబ్‌కి వెళ్లి, కాగ్‌వీల్ సింబల్‌పై క్లిక్ చేయాలి.

6. ‘షో యాక్టివిటీ స్టేటస్’ అనే ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి.

7. తద్వారా మీ లాస్ట్ సీన్‌ను ఎవరూ చూడలేరు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..