Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ చూడాలంటే సొమ్ములు చెల్లించాల్సిందే.. కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై కసరత్తులు చేస్తున్న కంపెనీ!
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు త్వరలో ఈ సోషల్ మీడియా ఖాతా కోసం చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి, ఇన్‌స్టాగ్రామ్(Instagram) కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై పని చేస్తోంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు త్వరలో ఈ సోషల్ మీడియా ఖాతా కోసం చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి, ఇన్‌స్టాగ్రామ్(Instagram) కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద, వినియోగదారులు కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రతి నెలా రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం, ఈ చెల్లింపు ఫీచర్‌కు సంబంధించి కంపెనీ అధికారిక పాలసీని జారీ చేయలేదు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ యాపిల్ యాప్ స్టోర్‌లో యాప్‌లో కొనుగోలుగా జాబితా చేశారు. దీని కోసం ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ కేటగిరీ కూడా క్రియేట్ చేసింది. ప్రస్తుతం, ఈ ఛార్జీ ఇక్కడ నెలకు 89 రూపాయలుగా కనిపిస్తోంది. ఇది ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినపుడు మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో టిప్‌స్టర్ అలెశాండ్రో పలుజ్జీ (@alex193a) ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి కొన్ని ట్వీట్లు చేశారు. వాటి ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబ్ బటన్‌ను పరీక్షిస్తోంది. ఇది సృష్టికర్తల ప్రొఫైల్‌లలో కనిపిస్తుంది. కంటెంట్ సృష్టికర్తలు తమ స్వంత సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను సెట్ చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతారు.
#Instagram is working on the possibility of editing posts on the website ? pic.twitter.com/tUwShXeQXc
— Alessandro Paluzzi (@alex193a) October 13, 2021
వినియోగదారులకు బ్యాడ్జ్..
సబ్‌స్క్రిప్షన్ తర్వాత మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ అభిమాన సృష్టికర్తల కంటెంట్‌ను చూడగలరని భావిస్తున్నారు. రూ. 89 చెల్లించి సభ్యత్వం పొందిన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుకు బ్యాడ్జ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు వ్యాఖ్య లేదా సందేశం చేసినప్పుడల్లా, ఈ బ్యాడ్జ్ మీ వినియోగదారు పేరు ముందు కనిపిస్తుంది. ఇది చందాదారుని వినియోగదారుని గుర్తించడంలో సహాయపడుతుంది. సబ్‌స్క్రిప్షన్ తర్వాత, క్రియేటర్‌లకు వారి ఆదాయం, సభ్యత్వం గడువు ముగిసే వివరాలు కూడా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..