Instagram: ఇకపై ఆ కష్టం కూడా లేదు.. కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్..

ఇన్‌స్టా రీల్స్ ప్రతి ఒక్కరు పిచ్చిగా చూస్తారు. టైమ్‌తో పనిలేకుండా రీల్స్ చూడడంలోనే మునిగిపోతారు. రీల్స్ స్క్రోల్ చేసి చేసి చేయి నొప్పి వచ్చినా చూడడం మాత్రం ఆపరు. ఈ క్రమంలో ఇన్‌స్టా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు నెట్టింట చర్చ నడుస్తోంది.

Instagram: ఇకపై ఆ కష్టం కూడా లేదు.. కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్..
Instagram New Feature

Updated on: Jul 20, 2025 | 3:54 PM

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరు టైమ్ పాస్ కోసం రీల్స్ చూడడం కామన్‌గా మారింది. రీల్స్ చేసేవాళ్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గంటల టైమ్ ఇన్‌స్టా రీల్స్ లోనే గడచిపోతుదంటూ చాలా మంది చెప్తారు. రీల్స్ స్క్రోల్ చేసి చేసి చేయి నొప్పి వచ్చినా చూడడం మాత్రం ఆపరు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి బాధలు లేకుండా ఇన్‌స్టా కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తో మీరు స్క్రోల్ చేసే అవసరం ఉండందు. ఎందుకంటే అవే ఆటో స్క్రోల్ అవుతాయి. ఇన్‌స్టా ఆటో స్క్రోల్ ఫీచర్ తీసుకొస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇది నిజమా..? కాదా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆటో స్క్రోల్ ఫీచర్ అంటే ఏమిటి?

గతకొన్ని రోజులుగా ఫేస్‌బుక్, ఎక్స్‌లలో చాలా మంది ఆటో స్క్రోల్‌కు సంబంధించి పోస్టులు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటో స్క్రోల్ అనే కొత్త ఆప్షన్ వస్తుందంటూ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు రీల్స్‌ను చేయితో స్క్రోల్ చేయవలసిన అవసరం లేదు. రీల్స్‌ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. సేమ్ నెట్‌ఫ్లిక్స్ ఆటో ప్లే ఫీచర్ లాగా ఇది పనిచేస్తుంది. రీల్స్ ఎక్కువగా చూసేవారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఫీచర్ నిజమా?

ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు. చర్చ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ నిజంగా ఆటో స్క్రోల్ ఫీచర్‌ను తీసుకువస్తే, అది ప్రజల ఆరోగ్యానికి మరింత హానికరం కావచ్చు. దీని వలన స్క్రీన్ సమయం పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, పిల్లలు, యువకులలో సోషల్ మీడియా వ్యసనం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఫీచర్ కు సంబంధించి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఇన్‌స్టా అలాంటి ఫీచర్ తీసుకొస్తే.. అది సోషల్ మీడియా చరిత్రలో అతిపెద్ద చెత్త ఫీచర్‌గా నిలుస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని.. అసలు ఈ ఫీచర్ తీసుకరావాల్సిన అవసరం ఏంటీ..? అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..