Instagram: ఇన్‌స్టాగ్రామ్‌తో చేతి నిండా సంపాద‌న‌.. భార‌త్‌లో అందుబాటులోకి పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌..

|

Jan 23, 2022 | 4:39 PM

Instagram: ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్‌ల‌ను యాక్స‌స్ చేయాలంటే ఎలాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే కొన్ని ప్ర‌త్యేక అకౌంట్‌ల‌ను మాత్రం యాక్సెస్ చేసుకోవాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ ఇప్ప‌టికే ఇలాంటి..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌తో చేతి నిండా సంపాద‌న‌.. భార‌త్‌లో అందుబాటులోకి పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌..
Follow us on

Instagram: ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్‌ల‌ను యాక్స‌స్ చేయాలంటే ఎలాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే కొన్ని ప్ర‌త్యేక అకౌంట్‌ల‌ను మాత్రం యాక్సెస్ చేసుకోవాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ ఇప్ప‌టికే ఇలాంటి ఆప్ష‌న్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌తో ఫేస్‌బుక్ పేజీల‌కు నెల‌కు కొంత మొత్తంలో చెల్లించి స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంద‌రు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల అకౌంట్ల‌కు ఇప్ప‌టికే ఈ ఫీచర్ అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి వ‌చ్చింది. అంటే ఇక‌పై క్రియేటివ్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే వారు డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశం ఉండ‌నుంద‌న్న‌మాట‌. ఇప్ప‌టికే అమెరికాలో కొంద‌రు క్రియేట‌ర్స్ కోసం ఈ ఆప్ష‌న్‌ను అందించిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా భార‌త్‌లో కూడా తీసుకొచ్చింది. కొంద‌రు క్రియేట‌ర్లు పోస్ట్ చేసే ఎక్స్‌క్లూజివ్ పోస్టులు, వీడియోల‌ను చూడాలంటే స‌ద‌రు క్రియేట‌ర్ అకౌంట్‌కు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రియేట‌ర్స్‌కు ఉన్న ఫాలోయింగ్ ఆధారంగా ఆ ఆప్ష‌న్‌ను ఇస్తారు. ఇక రూ. 89 నుంచి రూ. 890 వ‌ర‌కు చెల్లించి యాక్సెస్ పొంద‌వ‌చ్చు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం క్రియేట‌ర్స్‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఫీచ‌ర్‌ను సెట్ చేసుకునే అవ‌కాశం లేదు. అయితే త్వ‌ర‌లోనే క్రియేట‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

Also Read: Weight Loss Tips: సరిగా తినకున్నా బరువు పెరుగుతారా.. అప్పుడు ఏం చేయాలి..

Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌.. త‌క్కువ ధ‌ర‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..

Road Accident: కొంపముంచిన పొగమంచు.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. మహిళతో సహా ముగ్గురు మృతి