Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ సేవలకు మళ్లీ అంతరాయం.. వారంలో రెండోసారి.. ట్విట్టర్‌లో యూజర్లు గోలగోల..

Instagram Down: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ వారంలో రెండోసారి డౌన్‌ అయింది. దీంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు.

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ సేవలకు మళ్లీ అంతరాయం.. వారంలో రెండోసారి.. ట్విట్టర్‌లో యూజర్లు గోలగోల..
Instagram

Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 5:28 PM

Instagram Down: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ వారంలో రెండోసారి డౌన్‌ అయింది. దీంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత దాదాపు గంటపాటు ఇన్‌స్టా పనిచేయలేదు. ఈ సమయంలో వినియోగదారులు Insta ద్వారా సందేశాలను పంపగలిగారు కానీ వారి ఫీడ్ మాత్రం అప్‌డేట్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన తర్వాత #instagramdownagain అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసింది.

ట్విట్టర్ వినియోగదారులు మీమ్‌లను పోస్ట్ చేయడం కనిపించింది. అయితే కొంత సమయం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. దీంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినందుకు కంపెనీ కూడా విచారం వ్యక్తం చేసింది. మమ్మల్ని క్షమించండి సమస్య పరిష్కరించడానికి వీలైనంత త్వరగా పని చేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన విడుదల చేసింది.

గత సోమవారం ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు 7 గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ మళ్లీ గంటసేపు పనిచేయలేదు వారంలో ఇది రెండోసారి. ఇలా ఎందుకు జరగుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి సమస్య ఎదురైంది కానీ ఎప్పుడు ఇంత సమయం పట్టలేదు. 5 నుంచి 10 నిమిషాలలో సమస్య పరిష్కారం అయ్యేది.

ఈ సమస్య వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

Read Also: IPL 2021, RCB vs DC Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న భరత్, మ్యాక్స్‌వెల్

SRH vs MI: దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్‌.. సన్‌ రైజర్స్‌పై ఘన విజయం..

Hyderabad Rains: హైదరాబాద్‌ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..