Indian Railways: లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? దీనిని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? పూర్తి వివరాలు

|

Jun 04, 2023 | 4:16 PM

ఒడిశాలోని రైలు ప్రమాదం విషాధంగా మారింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం నిన్నటి వరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలంలో..

Indian Railways: లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? దీనిని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? పూర్తి వివరాలు
Railway Loop Line
Follow us on

ఒడిశాలోని రైలు ప్రమాదం విషాధంగా మారింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం నిన్నటి వరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలంలో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా మారాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఇతర సహాయక బృందాలు సైతం తీవ్రంగా శ్రమించి శవాలకు బయటలకు తీశారు. అయితే ఈ ప్రమాదం భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన 5 రైల్వే ప్రమాదాలలో ఇదొకటి. ట్రాక్‌ పునరుద్దరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సిగ్నల్స్‌ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు చెన్నైకు వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాన రైల్వే లైన్‌కు బదులు లూప్‌లైన్‌ మీదకు వెళ్లిందని రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది.

127 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టిన కోరమండల్‌:

ముందుగా ప్రధాన రైల్వే లైన్‌లోకి వెళ్లేందుకు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ట్రైన్‌ లూప్‌లైన్‌లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆ లూప్‌లైన్‌లో అప్పటికే ఐరన్ ఓడ్ లోడ్ తో ఉన్న గూడ్స్‌ రైలు ఆగి ఉంది. ఇదే సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటలకు 127 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పక్కనే ఉన్న ప్రధాన లైన్‌ మీదకు వెళ్లాయి. అదే సమయంలో గంటకు 124 కిలోమీటర్ల వేగంతో వస్తున్న యాశ్వంత్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో ప్రధాన రైల్వేలైను మీద నుంచి వెళ్తుంది. పట్టాలు తప్పిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఈ రైలు మీదకు వెళ్లడంతో ఘోర ప్రమాదం సంభవించింది.

లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? దానిని ఎందుకు ఏర్పాటు చేస్తారు..?

లూప్‌లైన్‌ అంటే ఏమిటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రధాన రైల్వే లైన్‌లను కలుపుతూ కొన్ని ఇతర ట్రాక్‌లు ఏర్పాటు చేస్తుంది రైల్వే. ఈ లైన్‌ల వల్ల స్టేషన్‌లో ఎక్కువ రైళ్లను నిలిపి ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేరే రైళ్లకు దారి ఇచ్చేందుకు ఈ లూప్‌లైన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ లూప్‌లైన్‌ను కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ప్రధాన లైన్‌కు కలుపుతారు.

ఇవి కూడా చదవండి

లూప్‌లైన్‌ పొడవు ఎంత ఉంటుంది..?

ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు కీలక పాత్ర పోషించే ఈ లూప్‌లైన్‌లు సుమారు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజన్లతో పాటు మొత్తం రైలును నిలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1500 మీటర్ల పొడవు ఉండే లూప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వే చర్యలు చేపడుతోంది. అంటే ఈ లూప్‌లైన్‌ పొడవు రెండింతలుగా ఉండేలా ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి