
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా మంది గూగుల్‌లో ఓ యాప్ గురించి తెగ వెతుకుతున్నారు.. అదే “టెలిగ్రామ్ వీపీఎన్ నీట్” దీని కోసం ఎందుకు ఇంతలా వెతుకుతున్నారంటే.. దీని వెనక ఒక కారణం ఉంది. ఇటీవల దేశంలో నీట్ పేపర్ లీక్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే పేపర్ లీక్ వ్యవహారం మొత్తం టెలిగ్రామ్ ద్వారానే జరిగిందన్న ఆరోపణలతో దేశంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా జూన్ 16 నుండి జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేసింది.
అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఊహించని పరిణామం వెలుగు చూసింది. ప్రభుత్వ ఆంక్షలను అధిగమించడానికి ప్రజలు కొత్త మార్గాలను వెతకడం స్టార్ట్ చేశారు. టెలిగ్రామ్ పోతేనే.. టెలిగ్రామ్ కోసం VPN ఉంటుందిగా అని.. ఈ యాప్ కోసం గూగుల్‌లో సెర్చ చేయడం స్టార్ట్ చేశారు. జూన్ 15 వరకు, దీనికి గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య చూస్తే సున్నాగా ఉందగా.. జూన్ 16న ప్రభుత్వం టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధించిన తర్వాత టెలిగ్రామ్ వీపీఎన్ కోసం సెర్చ్ చేసే వారికి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. గంటల వ్యవధిలోనే ఇది వందలు, వేలకు చేరుకుంది.
ఈ ఆకస్మిక పెరుగుదల చూస్తే వినియోగదారులు టెలిగ్రామ్‌పై ఏ మేర ఆధారపడ్డారో అనేది అర్థమవుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రామ్ యూజర్స్‌ను చూసుకుంటే.. మన దేశంలోని జనాలు దీనిపై ఎంత మేర వినియోగిస్తున్నారో అనేదిపై స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అవును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలోనే టెలిగ్రామ్ యూజ్ చేసి వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
స్టాటిస్టా సర్వే ప్రకారం.. టెలిగ్రామ్‌కు ఉన్న మొత్తం యూజర్స్‌లో 45 శాతం మంది భారతీయులే ఉన్నట్టు తెలింది. సర్వే చేసిన అన్ని దేశాలలోకెల్లా భారత్ టాప్‌లో నిలవగా తర్వాత బ్రెజిల్ (38 శాతం), మెక్సికో (34 శాతం), దక్షిణాఫ్రికా, స్పెయిన్ (32 శాతం) ఉన్నాయి. అమెరికాలో టెలిగ్రామ్ టెలిగ్రామ్ యూజర్స్ 9 శాతం మంది ఉంటే జపాన్‌లో కేవలం 1 శాతం మాత్రమే ఉన్నట్టు తెలుస్తొంది.
మొత్తంగా నీట్ రీ-ఎగ్జామ్ సమయంలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ యాప్‌పై నిషేదం విధించినప్పటికీ వినియోగదారులు యాప్ నుండి దూరం కాకుండా, ఎలాగైనా యాక్సెస్ పొందడానికే ప్రయత్నిస్తున్నారని వారి ప్రవర్తన సూచిస్తోంది. VPN సెర్చ్‌లలో వచ్చిన ఈ భారీ పెరుగుదలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
FAQ..
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.