
Indian Government: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక విండోస్, మాక్ ఓఎస్, లైనక్స్ అన్ని వెర్షన్‌లకు వర్తిస్తుందని పేర్కొంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో రెండు హై-రిస్క్ భద్రతా లోపాలు గుర్తించింది. CERT విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. గుర్తించిన లోపాలు CVE-2025-13223, CVE-2025-13224, రెండూ తీవ్రమైనవిగా పరిగణిస్తున్నారు.
ఈ లోపాలు హ్యాకర్లు మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా దాడి చేయడానికి అనుమతించేలా ఉన్నాయని గుర్తించారు. Chrome V8 జావాస్క్రిప్ట్ ఇంజిన్‌లోని టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్ వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీని వలన బ్రౌజర్ తప్పు మెమరీ స్థానాలను కూడా యాక్సెస్ చేస్తుంది. దీనిని హ్యాకర్లు మీ కంప్యూటర్‌కు హానికరమైన కోడ్‌ను అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. నిర్దిష్ట వెబ్ పేజీని తెరవడం ద్వారా మీ కంప్యూటర్‌పై దాడి చేయవచ్చు.
గూగుల్ ప్రకారం.. హ్యాకర్లు ఇప్పటికే CVE-2025-13223 హానికరమైన ఉపయోగించుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ఇది మరింత తీవ్రమైంది. దీనికి ఈ గూగుల్ క్రోమ్ వెర్షన్‌లు ప్రభావితం అవుతాయి.
కొత్త భద్రతా అప్‌డేట్‌లు ఇప్పటికే విడుదలయ్యాయని గూగుల్ తెలిపింది.
వినియోగదారులు వెంటనే ఏమి చేయాలి?
CERT-In వినియోగదారులు Chromeను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరుతోంది. కింద ఇచ్చిన పద్ధతిలో Chromeను అప్‌డేట్ చేయడం వల్ల కంప్యూటర్ దెబ్బతింటుంది.
భద్రతా లోపాలు ఉన్నప్పుడు తక్షణ అప్‌డేట్‌లు మాత్రమే సురక్షితమైన పరిష్కారం అని నిపుణులు అంటున్నారు. అందుకే Google Chromeను వెంటనే అప్‌డేట్ల వల్ల మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి