Brahmos Supersonic Cruise Missile in Balasore: భారత రక్షణ శాఖకు మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షన్‌ను ఒడిశా తీరంలో బాలాసోర్‌లో విజయవంతంగా పరీక్షించింది. కొత్త సాంకేతికతతో అమర్చిన క్షిపణిని భారత్ గురువారం ప్రయోగించింది. ఇది పరీక్ష తర్వాత విజయవంతంగా నిరూపించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్‌లను నిరంతరం పరీక్షిస్తోంది. పాకిస్థాన్ , చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ పరీక్ష జరుగుతోంది .
అంతకుముందు, జనవరి 11న, ఆధునీకరించిన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ‘అధునాతనమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వైవిధ్యాన్ని ఈ రోజు INS విశాఖపట్నం నుండి పరీక్షించింది. క్షిపణి లక్ష్యాన్ని కచ్చితంగా చేధించింది. ఈ పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు.
India successfully test-fires new version of BrahMos supersonic cruise missile off Odisha coast
Read @ANI Story | https://t.co/X6ax1yIAKA#BrahMos #missile pic.twitter.com/93EnMHXw5n
— ANI Digital (@ani_digital) January 20, 2022
బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి?
ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ సబ్‌మెరైన్‌లు, నౌకలు, విమానాలు లేదా భూ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రయోగించగల సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు మాక్ 2.8 లేదా ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో ప్రయోగించగలవు. బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఖచ్చితత్వం దానిని మరింత ప్రాణాంతకం చేస్తుంది. దీని పరిధిని కూడా పెంచుకోవచ్చు. ఇది కాకుండా, ఈ క్షిపణి శత్రు రాడార్ నుండి తప్పించుకోవడంలో కూడా ప్రవీణమైనది.
బ్రహ్మోస్‌లో బ్రహ్మ అంటే ‘బ్రహ్మపుత్ర’ మోస్ అంటే ‘మోస్క్వా’. రష్యాలో ప్రవహించే నది పేరు మోస్క్వా. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ 21వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటి. ఈ క్షిపణి గంటకు 4300 కి.మీ వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. ఇది 400 కి.మీ పరిధిలో శత్రువులను టార్గెట్ చేయగలదు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో ఫిలిప్పీన్స్ 374 మిలియన్ డాలర్ల ఒప్పందం
అదే సమయంలో, ఇటీవల ఫిలిప్పీన్స్ తన నౌకాదళం కోసం తీరంలో మోహరించే యాంటీ షిప్ క్షిపణుల సరఫరా కోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో $ 374 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తన నౌకాదళం కోసం సముద్ర తీరంలో మోహరించే యాంటీ షిప్ క్షిపణులను సరఫరా చేయడానికి కంపెనీ ఆఫర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. గత నెలలో అక్కడి ప్రభుత్వం 374 మిలియన్ డాలర్ల ప్రతిపాదనను ఆమోదించిందని ఆయన చెప్పారు. లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వివిధ వ్యూహాత్మక ప్రదేశాలలో భారతదేశం ఇప్పటికే భారీ సంఖ్యలో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించింది.
Read Also… Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు..