Google Maps: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో గూగుల్ మ్యాప్స్ చెబుతుంది..
Google Maps: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు అధునాత సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు...
Google Maps: మారుతోన్న కాలానికి అనుగుణంగా ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంది. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు అధునాత సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణంగా మనం ప్రయాణించే రైలు ప్రస్తుతం ఎక్కడ ఉంది.? ఏ సమయంలో మన స్టేషన్‌కు వస్తుంది.? లాంటి వివరాలు తెలుసుకోవడానికి పలు రకాల మార్గాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ జాబితాలోకి గూగుల్ మ్యాప్స్ వచ్చి చేరింది. చాలా సులభంగా రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఇంతకీ మ్యాప్స్‌ను ఉపయోగించి రైలు ఎక్కడుంది.? ఎలాంటి తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* ఇందు కోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ యాప్ ఉంటే దానిని అప్‌డేట్ చేసుకోవాలి.
* అనంతరం యాప్‌లోకి వెళ్లి మీరు వెళ్లే రైల్వే స్టేషన్‌ను యాప్‌లో సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి.
* వెంటనే ఆ స్టేషన్ నుంచి రైళ్లకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
* వీటిలో మీరు ఎక్కాల్సిన రైలుపై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ రైలు ఎక్కడ ఉంది.? ఏ సమయానికి స్టేషన్‌కు వస్తుంది లాంటి వివరాలు కనిపిస్తాయి.
IND vs SA: వార్తలు చదవను.. పత్రికలు చూడను.. అందుకే ఇలా.. శిఖర్ ధావన్..
Plastic Aadhaar Card: ఇలాంటి ఆధార్ కార్డులు చెల్లవు.. కీలక ప్రకటన చేసిన UIDAI..