AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Patients: షుగర్ పేషెంట్స్‌కి ఇదొక వరం.. ఇక రక్తపు బొట్టు బయటకు రాకుండా టెస్ట్..

డయాబెటిస్ రోగుల కోసం ఐఐటీ మద్రాస్ అద్బుత పరికరాన్ని అభివృద్ది చేసింది. బ్లడ్‌తో సంబంధం లేకుండా షుగర్ లెవల్స్ చెక్ చేసుకునే సరికొత్త పరికరాన్ని తయారుచేసింది. స్మార్ట్‌వాచ్ తరహాలో ఉండే ఈ డివైస్ అందుబాటులోకి వస్తే.. షుగర్ పేషెంట్స్‌కి ఇదొక వరంగా మారనుందని చెప్పవచ్చు.

Diabetes Patients: షుగర్ పేషెంట్స్‌కి ఇదొక వరం.. ఇక రక్తపు బొట్టు బయటకు రాకుండా టెస్ట్..
Iit Madras
Venkatrao Lella
|

Updated on: Nov 20, 2025 | 1:55 PM

Share

IIT Madras scientists: ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి షుగర్. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. దానిని అదుపులోకి తెచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. యువతీయువకుల నుంచి పెద్దవారి వరకు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు మొదలైనట్లే . తరచూ ఇన్సులిన్ ఎక్కించుకోవడం లేదా ట్యాబ్లెట్స్ వాడటం చేస్తూ ఉండాలి. ఒకరోజు వాడకపోయినా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి డయాబెటిస్ రోగులు ఇబ్బందులు పడుతూ ఉంటారు.

రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకునేందుకు షుగర్ పేషెంట్స్‌కు మార్కెట్లో అనేక రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా హాస్సిటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా డయాబెటిస్ రోగులు గ్లూకోమీటర్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వేలిపై సన్నటి సూదీతో పొడుచుకుని రక్తపు చుక్కను గ్లోకోమీటర్‌ టెస్ట్ స్ట్రిప్‌పై వేస్తే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఎంత శాతం ఉన్నాయనేది డిస్‌ప్లే అవుతుంది.

అయితే ఇక నుంచి షుగర్ పేషెంట్స్‌కు అలాంటి ఇబ్బందులు ఉండవు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇక మీరు గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ సైంటిస్టులు ఒక ఇన్నోవేటివ్ పరికరాన్ని అభివృద్ది చేశారు. స్మార్ట్‌వాచ్‌లా ఉండే ఇంటిగ్రేటెడ్ స్క్రీన్‌తో కూడిర బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాన్ని తయారుచేశారు. దీనిని చేతికి ధరిస్తే చాలు.. మీ రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ తెలుసుకోవచ్చు. ఈ డివైస్‌కు పేటెంట్‌ను కూడా సైంటిస్టులు తీసుకున్నారు. తక్కువ ధర డిస్‌ప్లే, మైక్రోనీడిల్ సెన్సార్‌ ప్యాచ్‌తో దీనిని అభివృద్ది చేశారు. షుగర్ పేషెంట్స్‌కు ఈ పరికరం ఒక వరం అని చెప్పవచ్చు.

ఈ డివైస్ అభివృద్దిలో పాలుపంచుకున్న సైంటిస్ట్ ఎల్ బాలమురుగన్ మాట్లాడుతూ..”షుగర్ పేషెంట్స్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పి లేకుండా ఎప్పటికప్పుడు లెవల్స్ చెక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పరికరం వాడటం ద్వారా దిగుమతి చేసుకున్న పరికరాల వాడకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రించవచ్చు. స్థానికంగా ఈ డివైస్‌ను తయారు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. త్వరలోనే రోగులపై క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం” అని తెలిపారు. Source: tv9english.com 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి