AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart sale: స్మార్ట్ ఫోన్లపై నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ ఆఫర్లు.. త్వరపడండి సమయం లేదు..

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఉన్న ఫోన్ ను మార్చి లేటెస్ట్ ఫీచర్ల ఫోన్ ను తీసుకోవడానికి ఆలోచిస్తున్నారా? మీకిదే మంచి సమయం. ఆధునిక ఫీచర్లు, సూపర్ లుక్, లేటెస్ట్ ఫీచర్ల తో ఆకట్టుకుంటున్న ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు అత్యంత భారీ డిస్కౌంట్ పై మీకు అందుబాటులోకి వచ్చాయి. మీలాంటి వారి కోసం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ ప్రారంభమైంది.

Flipkart sale: స్మార్ట్ ఫోన్లపై నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ ఆఫర్లు.. త్వరపడండి సమయం లేదు..
Flipkart
Madhu
|

Updated on: May 04, 2024 | 4:14 PM

Share

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఉన్న ఫోన్ ను మార్చి లేటెస్ట్ ఫీచర్ల ఫోన్ ను తీసుకోవడానికి ఆలోచిస్తున్నారా? మీకిదే మంచి సమయం. ఆధునిక ఫీచర్లు, సూపర్ లుక్, లేటెస్ట్ ఫీచర్ల తో ఆకట్టుకుంటున్న ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు అత్యంత భారీ డిస్కౌంట్ పై మీకు అందుబాటులోకి వచ్చాయి. మీలాంటి వారి కోసం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ ప్రారంభమైంది. అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లను అత్యంత తగ్గింపు ధరలకు పొందే వీలు లభించింది. మే 3వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

భారీ తగ్గింపు ధరలు..

స్మార్ట్ ఫోన్ నేడు కనీస అవసరంగా మారింది. మనం చేసే ప్రతి పనికీ అవసరంగా మారింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు కీలకమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు జేబులో రూపాయి లేకపోయినా అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అనేక రకాల ఫీచర్లతో వివిధ కంపెనీ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ఇవి స్టైలిష్ లుక్, మెరుగైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. అన్ని ఫీచర్లు కలిగిన ఫోన్ల ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

సామాన్యుడికి అందుబాటులో..

అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ల ధర సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అయిత్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ లో ఇలాంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. అతి తక్కువ ధరకే సామాన్యులను అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫోన్లు, వాటి తగ్గింపు ధరలను తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8 (google pixel 8)..

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ లో కొత్త గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.75,999. ప్రస్తుతం ప్రత్యేక తగ్గింపుపై రూ.49,999కు ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. టెన్సర్ జీ3 చిప్ సెట్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో పాటు ఏఐ ఫీచర్ల ఈ ఫోన్ లో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నథింగ్ ఫోన్ 2 (Nothing phone 2)..

గతేడాది మార్కెట్ లోకి విడుదలైన నోథింగ్ ఫోన్ 2కు వినియోగదారుల ఆదరణ చాలా బాగుంది. ప్రత్యేక డిజైన్, ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.39,999 కాగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ పై 29,999కి లభిస్తుంది. ప్రత్యేక ఫీచర్లు కలిగిన బెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గూగుల్ పిక్సెల్ 7ఏ (google pixel 7a)..

గూగుల్ స్మార్ట్ ఫోన్లలో ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఫోన్ ఇది. దీని ఒరిజినల్ రిటైల్ ధర రూ.43,999 కాగా.. ప్రత్యేక డిస్కౌంట్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.31,999 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ వంటివి కూడా వర్తిస్తాయి.

ఐఫోన్ 14 (iphone 14)..

లేటెస్ట్ ఐఫోన్ 14 నూ డిస్కౌంట్ సేల్ లో తగ్గింపు ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.55,999 కాగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో 19 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే రూ.69,990 ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..