
ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడం నేడు సాధారణ విషయంగా మారింది. ఆ ఫోన్ లేకపోతే రోజు ముందుకు నడవని పరిస్థితి ఏర్పడింది. నిత్య జీవితంలో చేయాల్సిన ప్రతి పనికీ అవసరంగా మారింది. ఫోన్ల కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రోజూ వివిధ బ్రాండ్ల కొత్త ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ప్రత్యేకతలు, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఫోన్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదు. కొందరు అయితే ఏడాదికే మార్చేస్తూ ఉంటారు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు వాట్సాప్ చాట్ లను పంపించడం చాలా ఇబ్బంది ఉంటుంది. దీని కారణంగా ఫోన్ వినియోగదారులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈ సమస్యకు మెటా చాలా సులువైన పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారుతున్న వినియోగదారులకు ఇది శుభవార్త. వాట్సాప్ చాట్ లను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా బదిలీ చేసుకోవచ్చు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు అత్యంత ప్రజాదరణ ఉంది. ఈ యాప్ లేని ఫోన్ ఉందంటే నమ్మలేం. నిత్యం జీవితంలో అనేక అనేక విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఫోన్ మార్చినప్పుడు వాట్సాప్ డేటాను మరో ఫోన్ కు బదిలీ చేసుకోవడం గతంలో ఇబ్బందిగా ఉండేది. మెటా తీసుకువచ్చిన కొత్త విధానంతో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారే యూజర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది. చాలా సులువుగా బదిలీ చేసుకునే వీలు కలిగింది.
వాట్సాప్ నుంచి మీడియా, చాట్‌లను బదిలీ చేయాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. అలాగే కొత్తగా తీసుకున్న ఐఫోన్ లో ఐఓఎస్ 15.5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేయాలి. వీటితో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మూవ్ టు ఐఓఎస్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయాలి.
ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కు వాట్సాప్ డేటా బదిలీ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మీ వాట్సాప్ లో ఉన్న బ్యాకప్ మీద సమయం ఆధారపడి ఉంటుంది. ముందుగా రెండు ఫోన్లనూ పవర్ సోర్స్‌లో ప్లగ్ చేసి ఉంచాలి. లేకపోతే స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 60 శాతం బ్యాటరీ చార్జింగ్ అవసరం. మీ రెండు పరికరాలను ఒకే వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి. లేకపోతే ఐఫోన్ అనుకూల హాట్‌స్పాట్ నెట్‌వర్క్‌కి ఆండ్రాయిడ్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..