WhatsApp: అరె.. ఈ ట్రిక్ భలే ఉందే.. అవతలి వ్యక్తికి తెలియకుండా సీక్రెట్‌గా వాట్సాప్ స్టేటస్ ఇలా చూడండి..

మీకు తెలియని అనేక వాట్సాప్ ట్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టిక్స్ గురించి ఈ స్టోరీలో చెప్పబోతున్నాం. దీన్ని సహాయంతో మీరు ఎవరికీ తెలియకుండా వాట్సాప్ స్టేటస్ చూడవచ్చు. ఇలా చూడడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటి? ఎలా చేయాలి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

WhatsApp: అరె.. ఈ ట్రిక్ భలే ఉందే.. అవతలి వ్యక్తికి తెలియకుండా సీక్రెట్‌గా వాట్సాప్ స్టేటస్ ఇలా చూడండి..
How To Secretly Watch Whatsapp Status,

Updated on: Sep 17, 2025 | 2:59 PM

ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అన్నీ ఫోన్లలో వాట్సాప్ అనేది కామన్‌గా మారింది. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు అంతా వాట్సాప్‌లోనే. అయితే మీకు తెలియని వాట్సాప్ ట్రిక్స్ చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఎవరికైనా తెలియకుండా వారి వాట్సాప్ స్టేటస్‌ను చూడాలనుకుంటాం. అది ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. మీరు కూడా వాట్సాప్ లో ఎవరికీ తెలియకుండా స్టేటస్ చూడాలనుకుంటున్నారా..? అయితే కొన్ని సీక్రెట్ ట్రిక్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ ట్రిక్స్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

రీడ్ రిసీప్ట్‌లను ఆఫ్ చేయడం

వాట్సాప్‌లో రీడ్ రిసీప్ట్స్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఆఫ్ చేయడం ద్వారా మీరు అవతలివారికి తెలియకుండా మెసేజ్‌లను చదవవచ్చు, అలాగే స్టేటస్‌లను చూడవచ్చు. ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు ఎవరి స్టేటస్ చూసినా వారికి మీరు చూసినట్లు తెలియదు.

ఎలా చేయాలి?

ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

అక్కడ Privacy అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు Read Receipts అనే ఆప్షన్‌ని ఆఫ్ చేయండి.

ఫైల్ మేనేజర్‌లో చూసే విధానం

మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే, ఫైల్ మేనేజర్‌లో కూడా వాట్సాప్ స్టేటస్‌లను చూడవచ్చు.

ఎలా చేయాలి?

మీ ఫోన్‌లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి.

ఆ తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్లండి.

అక్కడ Android ఫోల్డర్‌ని ఓపెన్ చేసి, Media అనే ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.

తర్వాత com.whatsapp ఫోల్డర్ ఓపెన్ చేసి, WhatsApp ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.

అక్కడ మీకు Media అనే ఫోల్డర్ కనిపిస్తుంది.

Media ఫోల్డర్‌పై క్లిక్ చేయగానే మీకు .Statuses అనే ఫోల్డర్ కనిపిస్తుంది.

ఈ ఫోల్డర్ కనిపించకపోతే, ఫైల్ మేనేజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Show Hidden Files అనే ఆప్షన్‌ని ఎనేబుల్ చేయండి.

ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే అన్నీ వాట్సాప్ స్టేటస్‌లు అక్కడ కనిపిస్తాయి.

ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వాట్సాప్ వెబ్

మీరు ల్యాప్‌టాప్ లేదా పీసీలో వాట్సాప్ వెబ్ వాడుతున్నట్లయితే, ఇన్‌కాగ్నిటో మోడ్‌లో కూడా స్టేటస్‌లను ఎవరికీ తెలియకుండా చూడవచ్చు.

ఎలా చేయాలి?

మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఇన్‌కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేయండి.

ఇప్పుడు web.whatsapp.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి.

మీ మొబైల్ వాట్సాప్‌ని ఉపయోగించి, స్క్రీన్‌పై కనిపించే QR కోడ్ని స్కాన్ చేయండి.

వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత, స్టేటస్ ఐకాన్‌పై క్లిక్ చేసి, స్టేటస్‌లు లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి.

స్టేటస్‌లు లోడ్ అయ్యాక, మీ కంప్యూటర్‌లో Wi-Fiని ఆఫ్ చేయండి.

ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్‌లో స్టేటస్‌లను చూడవచ్చు. మీరు ఆన్‌లైన్‌కి తిరిగి వచ్చినా, మీ పేరు స్టేటస్ వ్యూయర్స్ లిస్ట్‌లో కనిపించదు.

ఈ ట్రిక్స్ ఉపయోగించి అవతలి వ్యక్తికి తెలియకుండా వాట్సాప్ స్టేటస్ చూడండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..