WhatsApp: మీ మేసేజ్‏లు ఎవరైనా చూస్తారని అనుమానపడుతున్నారా ? ఈ సెట్టింగ్స్ చేస్తే మీ వాట్సప్ భద్రమే ఇక..

|

Jan 18, 2021 | 3:06 PM

గత కొన్ని రోజుల క్రితం వాట్సప్ ప్రైవసీ రూల్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో.. వ్యక్తిగత సమాచారంపై అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వాట్సప్ యూజర్ల నంబర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రత్యక్షమైనప్పటి

WhatsApp: మీ మేసేజ్‏లు ఎవరైనా చూస్తారని అనుమానపడుతున్నారా ? ఈ సెట్టింగ్స్ చేస్తే మీ వాట్సప్ భద్రమే ఇక..
Follow us on

గత కొన్ని రోజుల క్రితం వాట్సప్ ప్రైవసీ రూల్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో.. వ్యక్తిగత సమాచారంపై అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వాట్సప్ యూజర్ల నంబర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రత్యక్షమైనప్పటి నుంచి ఈ అనుమానాలు తారాస్థాయికి చేరాయి. తమ వాట్సప్ చాట్ హిస్టరీలను ఎవరైనా చూస్తున్నారేమో అని చాలా మందికి కలుగుతున్న అనుమానం. అయితే వాట్సప్‏లోని కొన్ని సెట్టింగ్స్‏ను మారిస్తే.. మీ వాట్సప్ భద్రంగా ఉంటుంది. అది ఎలా చేయాలో తెలుసుకుందామా..

ఈ మధ్య కాలంలో వాట్సప్‏లో ఫ్రెండ్స్‏తో చాట్ మాత్రమే కాకుండా.. మనం పనిచేసే కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను.. తమ సహ ఉద్యోగులతో వాట్సప్ ద్వారా పంచుకుంటున్నారు. అలాగే కొన్ని అఫిషియల్ మీటింగ్స్ విషయాలు, వాటికి సంబంధించిన వీడియోలు ఇలా అన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక మీ స్మార్ట్ ఫోన్ ఎవరైన తీసుకున్నా.. ముందుగా ఓపెన్ చేసేది వాట్సప్ మాత్రమే. అయితే మీ వాట్సప్ ఎవరు ఓపెన్ చేయకూడదు అనుకుంటే సెట్టింగ్స్‏లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేయడం అవసరం. అలాగే వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. పైన ఉన్న అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ సెలక్ట్ చేసాక.. చివరిగా ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.

ఇక ఇవే కాకుండా వాట్సప్‏లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయడానికి ముందుగా యాప్ ఓపెన్ చేసి.. రైట్ సైడ్ పైన కనిపించే త్రీ డాట్స్ పై క్లిక్ చేసి చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అకౌంట్ పై క్లిక్ చేసి.. two step verification పైన క్లిక్ చేయాలి. ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఓపెన్ చేసి ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాలి. ఇచ్చిన పిన్ నంబరును ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అంతే మీ వాట్సప్ ఎవరైన ఓపెన్ చేయాలన్నా.. ఇన్ స్టాల్ చేయాలన్నా.. టూ స్టెప్ వెరికేషన్ తప్పనిసరి. వేరే ఫోన్లలో మీ వాట్సప్ హ్యాక్ చేసినా ఈ పిన్ నంబర్ తప్పకుండా కావాలి. ఈ విధంగా చేస్తే మీ వాట్సప్ ఎవరు ఓపెన్ చేయలేరు.

Also Read:

What’s app privacy status: ప్రైవసీ రూల్స్‏పై మరోసారి వివరణ.. వైరల్ అవుతున్న వాట్సప్ కొత్త స్టేటస్..

What’s APP: ప్రైవసీ పాలసీ నిబంధనను వాయిదా వేసుకున్న వాట్సప్.. తిరిగి ఆరోజు నుంచి అమలులోకి.. కారణం ఎంటంటే ?