AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laptop Tips: ల్యాప్‌టాప్‌ను శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే భారీ నష్టమే..

ల్యాప్‌టాప్‌ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ధుమ్ము ధూళి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దాని స్క్రీన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కొద్దిపాటి ఒత్తిడి లేదా రసాయనాల వాడకం స్క్రీన్‌ను దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో స్క్రీన్ క్లీన్ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. లేకపోతే వేలల్లో..

Laptop Tips: ల్యాప్‌టాప్‌ను శుభ్రపరిచేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే భారీ నష్టమే..
Laptop Tips
Subhash Goud
|

Updated on: Aug 30, 2023 | 5:02 PM

Share

ఈరోజుల్లో ల్యాప్‌టాప్‌లు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన గ్యాడ్జెట్‌గా మారిపోయాయి. ఇది ఆఫీసు నుంచి ఇంటి వరకు విస్తృతంగా ఉపయోగంలో ఉంది. విద్యార్థి అయినా లేదా ప్రొఫెషనల్ అయినా, ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొత్త టెక్నాలజీతో అడ్వన్స్‌డ్‌గా కొత్త ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త జనరేషన్‌లో విడుదలవుతున్నాయి. అయితే ల్యాప్‌టాప్‌ను వాడకంతో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ధుమ్ము ధూళి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా దాని స్క్రీన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కొద్దిపాటి ఒత్తిడి లేదా రసాయనాల వాడకం స్క్రీన్‌ను దెబ్బతీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో స్క్రీన్ క్లీన్ చేసేటపుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. లేకపోతే వేలల్లో నష్టపోతారు. ల్యాప్‌టాప్‌లను వాడేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందికరమైన వస్తువులను ఉండకుండా చూడాలి. ఏదైనా వస్తువు ల్యాప్‌టాప్‌కు తగిలినట్లయితే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. వాడేటప్పుడు చాలా సున్నితంగా వాడాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మరి ల్యాప్‌టాప్‌ను శుభ్రపరిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..? అనే విషయం గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

  • చాలా మంది నిపుణులు ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను శుభ్రం చేయడానికి రసాయనాలను ఉపయోగించవద్దని సిఫార్సు చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌తో పాటు హార్డ్‌వేర్ కూడా దెబ్బతినవచ్చు.
  • స్క్రీన్ నుంచి ధుమ్మును తొలగించడానికి ఏ రకమైన స్ప్రేని ఉపయోగించవద్దు. దీంతో ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ దెబ్బతింటుంది.
  • స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి ఆల్కహాల్ లేదా ఏదైనా రసాయనాలను ఉపయోగించవద్దు.
  • ఈ రోజుల్లో అన్ని టీవీలు, ల్యాప్‌టాప్‌లలో LCD స్క్రీన్‌లతో వస్తున్నాయి. రసాయనాలు దానిని దెబ్బతీస్తాయి.

ఎలా శుభ్రం చేయాలి?

  • ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి పొడి కాటన్ క్లాత్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించండి.
  • శుభ్రంగా ఉన్న గుడ్డను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. తద్వారా దానిలోని దుమ్ము కణాలు స్క్రీన్‌పై గీతలు పడవు.
  • స్క్రీన్‌ను శుభ్రపరిచేటప్పుడు ఒత్తిడి కారణంగా స్క్రీన్‌పై గీతలు పడకుండా, దెబ్బతినకుండా మీ చేతులతో సున్నితంగా ఉండండి.
  • స్క్రీన్ మరకగా ఉంటే, ముందుగా పొడి గుడ్డతో స్క్రీన్‌ను శుభ్రం చేయండి. అప్పుడు మీరు స్క్రీన్‌ను కొద్దిగా తడి గుడ్డతో తుడవవచ్చు. అయితే లోపలికి నీరు చేరకుండా జాగ్రత్తపడాలి.
  • అప్పటికీ స్క్రీన్ శుభ్రంగా కనిపించకపోతే మైక్రోఫైబర్ క్లాత్‌కు కొద్దిగా శానిటైజర్‌ని అప్లై చేసి, దానిని సున్నితంగా రుద్దండి.
  • ఎల్‌సీడీ స్క్రీన్ అయితే ఎటువంటి రసాయనాలను ఉపయోగించవద్దు.
  • స్క్రీన్‌ను శుభ్రపరిచేటప్పుడు వృత్తాకారంగా తుడుస్తూ శుభ్రం చేయాలి.
  • ముఖ్యంగా మూలలను శుభ్రపరిచేటప్పుడు వస్త్రాన్ని పొడిగా ఉంచండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి