
ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే రాత్రింబగళ్లు తిరిగే ఏసీలు ఒక్కోసారి అకస్మాత్తుగా చల్లదనాన్ని కోల్పోతుంటాయి. అలాంటప్పుడు మనం కంగారుపడి లోకల్ మెకానిక్‌లను ఆశ్రయిస్తాం. ఇదే అదనుగా భావించే కొంతమంది మోసగాళ్లు.. ఏసీని సరిగ్గా పరీక్షించకుండానే గ్యాస్ లీక్ అయింది.. గ్యాస్ రీఫిల్లింగ్ చేయాలి అంటూ రూ.2,500 నుండి రూ.3,000 వరకు వసూలు చేసి బురిడీ కొట్టిస్తుంటారు. నిజానికి ఏసీలో గ్యాస్ కరెక్ట్‌గా ఉన్నా చాలామంది ఈ మోసానికి గురవుతున్నారు. ఈ దోపిడీకి చెక్ పెట్టడానికి, అలాగే మీ ఏసీ గ్యాస్ లెవెల్‌ను మీరే కేవలం రెండు నిమిషాల్లో ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మార్కెట్‌లో ఆన్‌లైన్‌లో చాలా తక్కువ ధరకే మ్యానిఫోల్డ్ గేజ్ సెట్ అనే ఒక చిన్న పరికరం లభిస్తుంది. దీన్ని ఒక్కసారి కొని పెట్టుకుంటే.. మెకానిక్‌ల చేతిలో మోసపోకుండా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
ఒకవేళ మీటర్ పరీక్షలో గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తేలితే.. వెంటనే బ్లైండ్‌గా గ్యాస్ నింపించకండి. ఎందుకంటే ఏసీలోని గ్యాస్ దానంతట అదే ఎప్పటికీ అయిపోదు. ఎక్కడైనా లీకేజీ ఉంటేనే గ్యాస్ తగ్గుతుంది. కాబట్టి మొదట మెకానిక్‌తో లీకేజీ ఎక్కడ ఉందో కనుగొని, దాన్ని పూర్తిగా మూసివేయించిన తర్వాతే గ్యాస్ నింపించాలి. లేదంటే నింపిన గ్యాస్ కొన్ని రోజుల్లోనే మళ్లీ లీకై మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరవుతాయి.
చాలా సందర్భాల్లో గ్యాస్ ప్రాబ్లం వల్లే కాకుండా ఏసీ ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా కూలింగ్ తగ్గుతుంది. ఫిల్టర్లు మూసుకుపోతే గాలిని బయటకు పంపడానికి కంప్రెసర్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల ఏసీ 15 శాతం ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది.