AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor X8b: బడ్జెట్‌ ధరలో 108 ఎంపీ కెమెరా.. హానర్‌ నుంచి స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ఎక్స్‌ 8బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత సౌదీ అరేబియాలో లాంచ్‌ చేశారు. తర్వలోనే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. హానర్ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది...

Honor X8b: బడ్జెట్‌ ధరలో 108 ఎంపీ కెమెరా.. హానర్‌ నుంచి స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌..
Honor X8b
Narender Vaitla
|

Updated on: Dec 17, 2023 | 2:45 PM

Share

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌ హవా పెరిగింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ఎక్స్‌8బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం హానర్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ఎక్స్‌ 8బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత సౌదీ అరేబియాలో లాంచ్‌ చేశారు. తర్వలోనే భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. హానర్ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. మేజిక్‌ క్యాప్సూల్స్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. సైడ్‌ ఫేసింగ్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఫీచర్‌ను ఇచ్చారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయెల్​ సిమ్​, 4జీ వోల్ట్​ఈ, వైఫై 802.11ఏసీ, బ్లూటూత్​ 5.0జీ, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​.. 512జీబీ స్టోరేజ్​ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర భారత్‌లో రూ. 20 వేలుగా ఉంటుందని అంచనా. హానర్‌ ఎక్స్‌8బీ స్మార్ట్‌ ఫోన్‌ను మిడ్​నైట్​ బ్లాక్​, టిటానియం సిల్వర్​, గ్లామరస్​ గ్రీన్​ కలర్స్​లో అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్‌లో ఈ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ అవుతుందన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..