AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Photos: డిలీట్ అయిన ఫొటోలు కూడా రిస్టోర్ చేసుకోవచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు..

అనుకోని విధంగా ఆ ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ అయిపోయినా.. మిస్ అయిపోయినా బాధ పడతాం. అలాంటి మీ ఫోన్లోని ఓ యాప్.. పొరపాటున డిలీట్ అయిన ఫొటోలను తిరిగి అందివ్వగలుగుతుంది. మీ జ్ఞాపకాన్ని భద్రంగా ఉంచుతుంది. ఆ యాపే గూగుల్ ఫొటోస్ యాప్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Google Photos: డిలీట్ అయిన ఫొటోలు కూడా రిస్టోర్ చేసుకోవచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు..
Google Photos
Madhu
|

Updated on: Aug 04, 2024 | 5:54 PM

Share

మనకు కొన్ని అపురూపమైన సందర్భాలు ఉంటాయి. వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటూ ఉంటాం. అనుకోని విధంగా ఆ ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ అయిపోయినా.. మిస్ అయిపోయినా బాధ పడతాం. అలాంటి మీ ఫోన్లోని ఓ యాప్.. పొరపాటున డిలీట్ అయిన ఫొటోలను తిరిగి అందివ్వగలుగుతుంది. మీ జ్ఞాపకాన్ని భద్రంగా ఉంచుతుంది. ఆ యాపే గూగుల్ ఫొటోస్ యాప్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్ ఫొటోస్..

గూగుల్ ఫొటోస్ యాప్.. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది. దాని సాయంతో ఫొటోలను స్టోర్ చేసుకోవచ్చు. అయితే అనుకోని విధంగా గూగుల్ ఫొటోలను యాక్సిడెంటల్ గా డిలీట్ చేస్తే.. అది మీకు బాగా కావాల్సిన ఫొటో అయితే చాలా బాధ అనిపిస్తుంది. దానిని తిరిగి రిస్టోర్ చేసుకునే అవకాశం గురించి వెతుకుతారు. ఈ కథనంలో దాని గురించే తెలియజేస్తున్నాం. మీరు ఇటీవల గూగుల్ ఫొటోల్లోని చిత్రాలను ఏమైనా డిలీట్ చేస్తే వాటిని తిరిగి పొందుకునే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంటుంది.

ఈ ప్రక్రియ ఇది..

  • గూగుల్ ఫొటోస్ యాప్ ను ఓపెన్ చేయండి.
  • దానిలో ట్రాష్ లేదా బిన్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇది లైబ్రెరీ లేదా ఆల్బమ్స్ సెక్షన్లో ఉంటుంది.
  • దానిలో కనిపిస్తున్న డిలీటెడ్ పొటోల్లో మీకు కావాల్సిన ఫొటోలను ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత రిస్టోర్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ ఫొటోలను మెయిన్ ఫొటో లైబ్రెరీలోకి తెచ్చుకోవచ్చు.

ఇది గుర్తుంచుకోండి..

సాధారణంగా డిలీట్ చేసిన ఫొటోలు ట్రాష్ ఫోల్డర్లో 60 రోజుల వరకూ స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ తర్వాత పర్మినెంట్ గా డిలీట్ అవుతాయి. అప్పటి వరకూ మీరు ఆ ఫొటోలను రిస్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ట్రాష్ ఫోల్డర్ ను మీరు ఎంటీ చేస్తే మాత్రం ఆ ఫొటో శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి.

మరికొన్ని టిప్స్..

  • ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. మీ డివైజ్ లోని ఫొటోలను ఎప్పటికప్పుడు బ్యాక్ అప్ చేసుకోవాలి. అందువల్ల పొరపాటున మీరు ఫొటోలను డిలీట్ చేసినా.. వాటిని తిరిగి పొందే వీలుంటుంది.
  • అలాగే మీరు గూగుల్ ఫొటోలను బహుళ డివైజెస్ లో వాడితే.. మీకు కావాల్సిన ఫొటో కోసం ఆ డివైజ్ లలో కూడా వెతకొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్