Google: 2023లో నెటిజన్లు ఏం సెర్చ్‌ చేయనున్నారో తెలుసా.? యూజర్ల సమాధానానికి గూగుల్‌కు మైండ్‌ బ్లాంక్‌..

|

Jan 02, 2023 | 2:48 PM

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతికే రోజులు వచ్చేశాయి. వార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది..

Google: 2023లో నెటిజన్లు ఏం సెర్చ్‌ చేయనున్నారో తెలుసా.? యూజర్ల సమాధానానికి గూగుల్‌కు మైండ్‌ బ్లాంక్‌..
Google Search
Follow us on

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో వెతికే రోజులు వచ్చేశాయి. వార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది ఏం వెతకాలనుకుంటున్నారన్న ఆసక్తికరమైన సందేహం సహజంగానే వస్తుంది. గూగుల్ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలన కుంది. ఇందులో భాగంగానే గూగుల్ తమ యూజర్లకు ఓ ప్రశ్నను సంధించింది. ‘2023లో మీరు మొదట దేని గురించి సెర్చ్‌ చేయబోతున్నారు.?’ అని ట్వీట్ చేసింది. గూగుల్‌ అడిగిన ఈ ప్రశ్నకు నెటిజన్లు రకరకాల సమాధానాలు చెప్పారు. అయితే ఇందులో ఓ ఆన్సర్‌ మాత్రం గూగుల్‌ మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి.? అంతలా గూగుల్‌ను ఎందుకు భయపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ అడిగిన ప్రశ్నకు ఎక్కువ మంది యూజర్లు సమాధానంగా చాట్‌జీపీటీ అని సమాధానం ఇచ్చారు. 2023లో తాము మొదటగా చాట్ జీపీటీ గురించి సెర్చ్‌ చేయాలనుకుంటున్నామని నెటిజన్లు తెలిపారు. ఇంతకి ఈ చాట్‌ జీపీటీ అంటే ఏంటనేగా మీ సందేహం. ఇది కూడా అచ్చంగా గూగుల్‌ లాంటి ఓ సెర్చ్‌ ఇంజన్‌. ఇది సమాచారాన్ని గూగుల్‌ కంటే మెరుగ్గా ఇస్తోందని చాలా మంది భావిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఈ సమాధానం చెప్పడం గుగూల్‌కు ఓ రకంగా ఛాలెంజ్‌ అని చెప్పాలి. తన ప్రత్యర్థి సంస్థక కోసం యూజర్లు ఇంతలా ఆసక్తి చూపిస్తున్నారన్న అంశంపై గూగుల్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేయాలనుకుంటోన్న మరో అంశం.. కరోనా ఎప్పుడు అంతమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో నెటిజన్లు అసలు ఈ కరోనా పూర్తిగా ఎప్పుడు అంతమవుతుందన్న అంశంపై గూగుల్‌లో వెతకనున్నట్లు తెలిపారు. కరోనాపై మరోసారి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం. ఇక నెటిజన్లు 2023లో వెతకాలనుకుంటున్న మరో అంశం గూగుల్‌లో ఎలా ఉద్యోగం పొందాలి.? గూగుల్‌ క్లౌడ్‌ ఇంజనీర్‌గా ఎలా మారాలి.? అంశాలను సెర్చ్‌ చేయనున్నట్లు పలువురు ట్వీట్ చేశారు. వీటితో పాటు ట్విట్టర్‌ కొత్త సీఈఓ, పిక్సెల్‌ ట్యాబ్లెట్‌ రిలీజ్‌ డేట్‌, హువావే – గూగుల్ కంపెనీలు కలిసి పనిచేస్తాయా.? సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ రిలీజ్‌ లాంటి వాటి గురించి సెర్చ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..