ప్రస్తుత రోజుల్లో యువత పెరిగిన టెక్నాలజీను ఆశ్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో గేమ్స్ ఆడడాన్ని ఇష్టపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆడే గేమ్స్ కంటే ల్యాప్‌టాప్స్‌లో ఆడే గేమ్స్‌ను చిన్న పిల్లలతో పాటు యువత కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలు గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఏసర్ నివిడా గ్రాఫిక్ కార్డు ఫీచర్‌తో ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం ఏస్పైర్ 7 పేరుతో నయా ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. ఏసర్ అధికారికంగా ఏస్పైర్ 7 ల్యాప్‌టాప్‌ను గేమర్స్, ప్రొఫెషనల్స్ ఇద్దరికీ ఉపయోగపడేలా రూపొందించింది. కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కేవలం రూ. 61,990 ధరతో విండోస్ 11తో వచ్చే ఏస్పైర్ 7 ల్యాప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఏసర్ ఏస్పైర్ 7 ల్యాప్‌టాప్ రెండు శక్తివంతమైన నివిడా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ గ్రాఫిక్ కార్డులతో వస్తుంది. ఈ గ్రాఫిక్స్ కార్డ్‌లు అధిక ఫ్రేమ్ రేట్‌లు, మెరుగైన విజువల్ ఎఫెక్ట్‌లు, ఉన్నతమైన రెండరింగ్ సామర్థ్యాలను అందిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఫ్లూయిడ్ విజువల్స్, స్లో మోషన్ బ్లర్ కోసం ఈ ఫీచర్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ ప్యానెల్ పవర్ ఫుల్ కలర్స్ మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. వేగవంతమైన డేటా యాక్సెస్, మృదువైన మల్టీ టాస్కింగ్ అనువుగా ఉండే ఈ ల్యాప్‌టాప్ హై-డెఫినిషన్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్‌లతో వస్తుంది.
ఈ ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ బరువు 1.99 కిలోలు. తేలికపాటి డిజైన్ పవర్, పోర్టబిలిటీని బ్యాలెన్స్ చేయాల్సిన వినియోగదారులకు అనుకూలమైన ఎంపికగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో న్యూమరిక్ ప్యాడ్‌తో కూడిన మల్టీ-కలర్ ఇల్యూమినేటెడ్ ఫుల్-సైజ్ కీబోర్డ్ కూడా ఉంది. సమగ్రమైన కనెక్టివిటీ ఎంపికలు ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత. యూఎస్‌బీ 3.2 టైప్-సీ, టైప్-ఏ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ, మినీ డిస్ప్లేపోర్ట్, ఆర్‌జే-45 పోర్ట్‌లతో వస్తంది. ఇంటెల్ వైర్‌లెస్ వైఫై 6 టెక్నాలజీతో వచ్చే ఈ లాప్‌టాప్ ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్క్ అనుభవాలు రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఆస్పైర్ 7 ల్యాప్‌టాప్ ధరను రూ. 61,990గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..