ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా కనీసం రెండు స్మార్ట్ ఫోన్స్ ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్ రేట్స్ తగ్గడం, అందరికీ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్‌నెను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. నగదు లావాదేవీలు మొదలు, గేమింగ్ వరకు అన్నింటికీ ఇంటర్‌నెట్ అవసరం అనివార్యంగా మారడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ తగ్గడం చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ ఫోన్‌లో నెట్ స్పీడ్ తగ్గానికి కారణాలు ఏంటి.? తగ్గిన స్పీడ్‌ను ఎలా పెంచుకోవాలి.? లాంటి విషయాలు మీకోసం..
* ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ తగ్గితే వెంటనే సెట్టింగ్స్‌లో కొన్ని విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం 4జీ లేదా ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి.
* నెట్ స్పీడ్ పెంచుకోవాలంటే యాక్సెస్ పాయింట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో ఏపీఎన్‌లోకి వెళ్లి డీఫాల్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఇక సోషల్ మీడియా యాప్స్‌లో ఆటోప్లే వీడియో మోడ్ వల్ల కూడా ఇంటర్‌నెట్ స్పీ్డ్ తగ్గుతుంది. అంటే మీరు యాప్‌ను ఓపెన్ చేయకపోయినా అందులోని వీడియోలకు నెట్ ఉపయోగించుకుంటూనే ఉంటాయి. కాబట్టి ఆటో ప్లే వీడియో మోడ్‌ను ఆఫ్ చేసుకోవాలి.
* ఇంటర్ నెట్ స్పీడ్ పెంచుకోవడానికి ఉన్న మరో మార్గం బ్రౌజర్‌లో డేటా సేవ్ మోడ్‌ను సెట్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ పెరుగుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..