Whatsapp: ఎవరు పడితే వారు వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్ చేస్తున్నారా.? ఇలా చెక్‌ పెట్టండి..

|

Nov 14, 2023 | 4:30 PM

అయితే వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ గ్రూప్స్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది... ఎవరో తెలియని వ్యక్తులు సైతం గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుండడమే. యూజర్‌ అనుమతి లేకుండానే కొన్ని రకాల గ్రూప్స్‌లో యాడ్‌ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి ఎన్నో గ్రూప్స్‌ని క్రియేట్ చేశారు. పార్టీల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్ చేస్తూ పెద్ద...

Whatsapp: ఎవరు పడితే వారు వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్ చేస్తున్నారా.? ఇలా చెక్‌ పెట్టండి..
Whatsapp Group
Follow us on

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్. ఇక వాట్సాప్‌లో గ్రూప్స్‌కు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఉద్యోగుల నుంచి కుటుంబ సభ్యుల వరకు అందరూ గ్రూప్స్‌ ద్వారా ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు.

అయితే వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ గ్రూప్స్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది… ఎవరో తెలియని వ్యక్తులు సైతం గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుండడమే. యూజర్‌ అనుమతి లేకుండానే కొన్ని రకాల గ్రూప్స్‌లో యాడ్‌ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి ఎన్నో గ్రూప్స్‌ని క్రియేట్ చేశారు. పార్టీల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్ చేస్తూ పెద్ద ఎత్తున సభ్యులను యాడ్‌ చేస్తున్నారు. దీంతో ప్రతీ రోజూ వేలల్లో మెసేజ్‌లు రావడం ఇబ్బందిగా మారుతోంది.

అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి వాట్సాప్‌లో ఓ ఫీచర్‌ అందుబాటులో ఉందన్న విషయం మీకు తెలుసా.? గ్రూప్‌లో చేరిన తర్వాత ఎగ్జిట్‌ అయ్యే కంటే ముందే గ్రూప్‌లో చేరకుండా చేసే ఈ ఫీచర్‌తో ఎంతో ప్రయోజనం ఉంది. ఇంతకీ ఏంటా ఫీచర్‌.? ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపు కనిపించే మూడు చుక్కలను క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. ‘గ్రూప్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసి.. అందులో.. ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వీటిలో ఎవ్రీవన్‌ కాకుండా మిగతా ఆప్షన్లు ఎంచుకోవచ్చు. దీంతో ఇకపై ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. మీకు మొదట ఇన్వైట్ లింక్‌ వస్తుంది. అప్పుడు ఆ లింక్‌ను క్లిక్‌ చేసి గ్రూప్‌లో యాడ్‌ అవ్వొచ్చు. ఇలాంటి లింక్‌లను కూడా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకొని క్లిక్‌ చేయాలి. ఈ లింక్‌ల పేరుతో కూడా కొందరు సైబర్‌ నేరస్థులు మీ ఫోన్‌ను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని గుర్తించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..