
లండన్‌కు చెందిన టెక్ బ్రాండ్ నథింగ్ తన స్మార్ట్‌ఫోన్లు, ఆడియో గాడ్జెట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా మే 8 నుంచి మే 15 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, EMI ఆఫర్లతో వినియోగదారులు అదనపు తగ్గింపులు కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది Nothing Phone (4a) సిరీస్. ఈ ఫోన్‌పై భారీ ధర తగ్గింపులు లభిస్తున్నాయి.
అర్హత గల క్రెడిట్ కార్డులతో EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని వేరియంట్‌లపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. ఇక Nothing Phone (4a) Pro మోడల్‌పైనా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి