Flipkart: ఇలాంటి ఆఫర్స్‌ నెవ్వర్‌ బిఫోర్, ఎవర్‌ ఆఫర్ట్‌.. స్మార్ట్ ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..

వీటికి తోడుగా ఇతర ఈ కామర్స్‌ సైట్స్‌ సైతం ఆఫర్లు అందుస్తున్నాయి. ఇక అమెజాన్‌, ఫ్లిప్‌ర్ట్‌లో పలు రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసే వారికి అదనం 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఈఎమ్‌ఐ ఆప్షన్‌తో కొనుగోలు చేసే వారికి మరిన్ని ప్రత్యేక డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్స్‌పై ఫ్లిప్‌ కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి...

Flipkart: ఇలాంటి ఆఫర్స్‌ నెవ్వర్‌ బిఫోర్, ఎవర్‌ ఆఫర్ట్‌.. స్మార్ట్ ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..
Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2023 | 10:00 PM

Flipkart big billion days: దేశంలో పండుగల సీజన్‌ క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి ఈ కామర్స్‌ సైట్స్‌. ఇందులో భాగంగానే దసరా, దీపావళికి కస్టమర్లను అట్రాక్ట్‌ చేసేందుకే సేల్స్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌ పేరుతో అక్టోబర్ 8వ తేదీ నుంచి సేల్‌ను మొదలు పెట్టాయి. ఈ సేల్‌లో భాగంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి.

వీటికి తోడుగా ఇతర ఈ కామర్స్‌ సైట్స్‌ సైతం ఆఫర్లు అందుస్తున్నాయి. ఇక అమెజాన్‌, ఫ్లిప్‌ర్ట్‌లో పలు రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేసే వారికి అదనం 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఈఎమ్‌ఐ ఆప్షన్‌తో కొనుగోలు చేసే వారికి మరిన్ని ప్రత్యేక డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్స్‌పై ఫ్లిప్‌ కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తున్నాయి. ఇంతకీ ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో ఏయే ఫోన్‌లపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

గూగుల్‌ పిక్సెల్ 7ఏ:

గూగుల్‌ పిక్సెల్‌ 7ఏపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 43,999కాగా సేల్‌లో భాగంగా రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 8 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.

రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ:

ఫ్లిప్‌ కార్ట్ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 12. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 20,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 120హెచ్‌జెడ్‌ ప్రో అమోఎల్‌ఈడీతో కూడిన డిస్‌ప్లేను అందించారు. 67 వాట్స్‌ టర్బో ఛార్జ్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 5జీ:

ఈ సేల్‌లో తక్కువ ధరకు 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునే మరో అవకాశం. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 5జీ ఫోన్‌ అసలు ధర రూ. 29,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. 256 జీబీ స్టోరేజ్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ సొంతం.

మోటోరోలా ఎడ్జ్‌ 40:

రూ. 25 వేలలోపు మంచి ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి మోటోరోలా ఎడ్జ్‌ 40 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ స్మార్ట్‌ అసలు ధర రూ. 29,999గా ఉండగా ప్రస్తుతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో లభిస్తుంది.

పోకో ఎక్స్‌5 ప్రో..

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీగా డిస్కౌంట్‌ లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ పోకో ఎక్స్‌ 5 ప్రో. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 22,999కాగా సేల్‌లో భాగంగా రూ. 17,999కిసొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 5000 డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. 120 హెచ్‌జెడ్‌ ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 67 వాట్స్‌ టర్బో ఛార్జింగ్ ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..