iPhone 12: రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..

|

Oct 03, 2023 | 1:47 PM

ఐఫోన్‌ 12ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌12 ధర ప్రస్తుతం రూ. 48,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మీడియం రేంజ్‌ ఆండ్రాయిడ్‌ ధరకు సమానం. పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లోనే..

iPhone 12: రూ. 33 వేలకే ఐఫోన్‌ 12 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..
Iphone12
Follow us on

ఐఫోన్‌ను ఒక్కసారైనా ఉపయోగించాలని కోరుకునే వారు మనలో చాలా మందే ఉంటారు. ఇందులో ఉండే సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్స్‌.. అధునాతన కెమెరానే దీనికి కారణం. అంతేకాకుండా యాపిల్‌ బ్రాండ్‌ అంటే ఒక స్టేటస్‌ సింబల్‌గా భావించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఐఫోన్‌ కొనుగోలు చేద్దామంటే ధరలు మాత్రం చుక్కలు చూపించేలా ఉంటాయి. అందుకే చాలా మంది కోరిక ఉన్నా ఐఫోన్‌ను కొనడానికి వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఫ్లిప్‌కార్ట్ ఒక సూపర్ డీల్‌ను తీసుకొస్తోంది.

ఐఫోన్‌ 12ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌12 ధర ప్రస్తుతం రూ. 48,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 32,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మీడియం రేంజ్‌ ఆండ్రాయిడ్‌ ధరకు సమానం. పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లోనే ఐఫోన్‌12పై డిస్కౌంట్‌ లభించనుంది. రూ. 49వేల ఫోన్‌ను, రూ. 33 వేలకు సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

వీటికి అదనంగా ఫ్లిప్‌ కార్ట్‌లో ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను సైతం అందించనుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా ఏకంగా రూ. 30 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. వీటితో పాటు ఫ్లిప్‌ కార్ట్ స్పెషల్‌ ఆఫర్‌ కింద రూ. వెయ్యి, అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఇంతకీ ఐఫోన్‌ 12లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

ఐఫోన్‌ 12 స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. మెగా పిక్సెల్‌ తక్కువే అయినప్పటికీ ఫొటోలు క్లారిటీ బాగుటుంది. రెయిర్‌ కెమెరాలో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్‌ ఏ14 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..