Google Pixel 9: ఎట్టకేలకు భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే..?

|

Aug 14, 2024 | 4:45 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ గురించి ఇటీవల ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. గూగుల్ కంపెనీ పిక్సెల్ 9 సిరీస్‌ను అధికారికంగా భారతదేశంలో రిలీజ్ ఈసారి కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ సిరీస్‌లో మూడు మోడళ్లను ప్రకటించింది. ఇవి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్. మోడల్‌ను బట్టి ఈ ఫోన్లు ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటాయని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

Google Pixel 9: ఎట్టకేలకు భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే..?
Google Pixel 9 Series
Follow us on

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ గురించి ఇటీవల ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. గూగుల్ కంపెనీ పిక్సెల్ 9 సిరీస్‌ను అధికారికంగా భారతదేశంలో రిలీజ్ ఈసారి కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ సిరీస్‌లో మూడు మోడళ్లను ప్రకటించింది. ఇవి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్. మోడల్‌ను బట్టి ఈ ఫోన్లు ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటాయని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్‌తో యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధరలపై ఓ లుక్కేద్దాం.

పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ టాప్-ఎండ్ మోడల్‌తో వినియోగదారులకు అత్యంత ప్రీమియం అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు. పిక్సెల్ 9 ప్రో మంచి పనితీరుతో ఉండే ఫోన్ తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వారికి అనువుగా ఉంటుంది. అలాగే బడ్జెట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా పిక్సెల్ 9 ఫోన్ ఉంటుందని వివరిస్తున్నారు. పిక్సెల్ 9 సిరీస్ స్టాండర్డ్ మోడల్‌కు సంబంధించిన 128 జీబీ వేరియంట్ ఫోన్ రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది. పిక్సెల్ 9 ప్రో ధర రూ. 94,999, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ధర రూ. 1,14,999గా ఉంది. కొత్త పిక్సెల్ 9 సిరీస్ అబ్సిడియన్, పోర్సిలియోన్, వింటర్‌గ్రీన్, పియోనీ, హాజెల్, రోజ్ క్వార్ట్జ్ వంటి వివిధ రంగులలో అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. 

రేపటి నుంచి ప్రీ ఆర్డర్లు

గూగుల్ పిక్సెల్ 9,గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ల ప్రీ-ఆర్డర్‌లు గురువారం నుంచి ప్రారంభమవుతాయని గూగుల్ ప్రకటించింది. ప్రీ ఆర్డర్ చేసిన వారికి ఆగస్ట్ 22 నుంచి డెలివరీలను ప్రారంభిస్తామని పేర్కొంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నా, అధికారిక వివరాలు మాత్రం అందుబాటులో లేదు. అయితే గూగుల్ త్వరలో ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులో మూడు వాక్-ఇన్ సెంటర్‌లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. విక్రయ ఆఫర్‌ల విషయానికొస్తే వినియోగదారులు పిక్సెల్ 9 ఫోన్లతో ఒక సంవత్సరం వరకు గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చని గూగుల్ తెలిపింది. అలాగే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ కొనుగోళ్లపై వివిధ ఆఫర్ల కింద రూ.10 వేల వరకు తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి