భారత్‌లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తుంది. కేవలం వాచ్‌లు సమయం చూసుకోడానికి మాత్రమే కాకుండా మనల్ని ఫిట్‌గా ఉంచడానికి నోటిఫికేషన్లు పంపడంతో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ముఖ్యంగా జీవనశైలిని మెరుగుపర్చడంలో కూడా ఈ స్మార్ట్ వాచ్‌లు సాయపడుతున్నాయి. ప్రతిరోజూ మన దినచర్యలు మెరుగుపర్చేలా నోటిఫికేషన్లు పంపుతూ ఉంటుంది. వర్క్ అవుట్ సమయంలో హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 రేట్, క్యాలరీల సమయం వంటి ఎన్నో వివరాలను తెలియజేస్తున్నాయి. అయితే యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఫాస్ట్రాక్ బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ రాబోతుందని తెలుస్తుంది. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా ఈ వాచ్‌ను రూపొందించారు. తన రివోల్ట్ సిరీస్‌లో మరో కొత్త వాచ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్‌ఎస్ 1 పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితం వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ వాచ్ ధరను కంపెనీ కేవలం రూ.1695గా మాత్రమే నిర్ణయించింది. ఫాస్ట్రాక్ ఫ్యాషన్ సెగ్మెంట్‌లో ఈ వాచ్ తన ప్రత్యేకతను చూపిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వాచ్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లో వచ్చే ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం