Facebook: దూకుడుగా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్‌.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ..

|

Feb 18, 2021 | 2:23 PM

Facebook Blocks News Sharing In Australia: ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తోంది. ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌లో న్యూస్‌ షేరింగ్‌ను, వార్తలను చూసుకునే..

Facebook: దూకుడుగా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్‌.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ..
Follow us on

Facebook Blocks News Sharing In Australia: ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తోంది. ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌లో న్యూస్‌ షేరింగ్‌ను, వార్తలను చూసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్‌ తొలగించింది. ఈ కమ్రంలో ఆస్ట్రేలియాలోని న్యూస్‌ సైట్‌లకు చెందిన పేజీలను ఫేస్‌బుక్‌ గురువారం బ్లాక్‌ చేసింది.
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌కు సంబంధించిన వార్త సంస్థలకు సంబంధించి డబ్బుల చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురానున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగానే ఫేస్‌బుక్‌ ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక కేవలం వార్తా సంబంధిత పేజీలనే కాకుండా ప్రభుత్వ శాఖలకు చెందిన ఆరోగ్య, ఎమర్జెన్సీలకు చెందిన పేజీలను సైతం ఫేస్‌బుక్‌ బ్లాక్‌ చేసింది. ఫేస్‌ బుక్‌ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వార్తలపై బ్యాన్‌ విధించడంల వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియా మంత్రి ఫ్రిడన్‌బర్గ్‌ అన్నారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఈ విషయమై మాట్లాడుతూ.. యావ‌త్ ప్రపంచాన్ని నడిపే శక్తి తమ వద్దే ఉందని ఫేస్‌బుక్‌ అనుకోవద్దని, డిజిట‌ల్ కాంటెంట్‌పై రూపొందిస్తున్న కొత్త చ‌ట్టాన్ని ఎఫ్‌బీ అడ్డుకోలేద‌ని ఆయన తేల్చి చెప్పారు.

Also Read: Telecom companies: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రానున్న రోజుల్లో పెరగనున్న ధరలు.. సన్నాహాలు చేస్తోన్న..