గత నెలలో తన పెద్ద దీపావళి సేల్‌ను ముగించిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ కొన్ని వారాల తర్వాత మరో సేల్ ఈవెంట్‌తో తిరిగి వచ్చింది. కొత్త ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ ఇప్పటికే ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ తాజా సేల్‌లో ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తుంది. గతంలో ఆఫర్లను మిస్ చేసుకున్న వినియోగదారులే లక్ష్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై నమ్మలేని ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో ఏయే ఫోన్స్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్‌ఫోన్‌భారతదేశంలో రూ. 22,999కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో భారీగా తగ్గింది. ఈ సేల్‌లో ఈ ఫోన్ రూ. 18,999కు అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌లో హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్‌తో పని చేస్తుంది.
నథింగ్ ఫోన్ (2) ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ ఫోన్ మొదట్లో రూ. 44,999కు లాంచ్ చేశారు. అంటే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (2)పై రూ. 5,000 ఫ్లాట్ తగ్గింపును పొందుతున్నారు. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం తగ్గింపు కూడా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ. 13,399కు అందుబాటులో ఉంటుంది. పైగా బ్యాంక్ ఆఫర్ ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో కూడా అందుబాటులో ఉంది.
మోటరోలా ఎడ్జ్ 40 రూ. 30,000 లోపు అత్యుత్తమ 5జీ ఫోన్‌లలో ఒకటిఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.26,999 వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 29,999. తక్కువ ధరకే స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని పొందాలనుకునే వ్యక్తులు ఈ మోటరోలా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ రేట్‌తో వస్తుంది. ప్రీమియం లెదర్ బ్యాక్ ప్యానెల్ కూడా ఉంది.
అలాగే ఈ సేల్‌లో రెడ్‌మీ 12సీ తక్కువ ధర రూ. 6,799 వద్ద జాబితా చేయబడింది. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఇతర డీల్‌లను తనిఖీ చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..