సూర్యుడి కన్నా అత్యంత వేడిగా ఉన్న గ్రహాన్ని గుర్తించారు ఈఎస్‌ఓ శాస్త్రవేత్తలు. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న యూరోపియన్ సదరన్ అబ్ర్వేటరీ (ఈఎస్‌ఓ) ఓ ఖగోళ అద్భుతాన్ని కనుగొన్నారు. సౌర వ్యవస్థకు ఆవల సుమారు 640 కాంతి సంవత్సరాల దూరంలో అతి పెద్ద గ్రహం ఉన్నట్లు కొనుగొన్నారు. దీనికి ‘డబ్ల్యూఏఎస్పీ-76బి’ అని నామకరణం కూడా చేశారు. హై రిజల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్‌ను ఉపయోగించి ఈఎస్ఓ ఈ అతిపెద్ద వేడి గ్రహం లక్షణాలను కొనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాగా ఈ గ్రహంపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
ఇది అత్యంత వేడిగా ఉండే గ్రహం. ఇక్కడ నమోదయ్యే పగటి ఉష్ణోగ్రతల గురించి వింటే మనం షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత ఉంటేనే అల్లాడిపోతంతా. కానీ ఈ గ్రహంపై.. ఏకంగా 2,400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. ఈ గ్రహం.. సూర్యుడి కంటే ఇది 100 రెట్లు వేడిని కలిగి ఉంటుందనడంలో అతిశయోక్తిలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ వేడికి బలమైన లోహాలు సైతం కరిగిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లోహాలు కరిగిపోవడమే కాదు.. అవి ఆవిరిగా సైతం మారిపోతాయట. అలాగే అక్కడ ఇనుము వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే.. రాత్రివేళల్లో గాలులు ఈ ఇనుప ఆవిరిని చల్లని ప్రేదశాలకు తీసుకెళతాయని… ఆవిరి రూపంలోని ఆ ఇనుము గడ్డకట్టుకుపోతుందని ఈఎస్‌ఓ శాస్త్రజ్ఞులు తెలిపారు.
Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..
హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు
బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం