Electric Bus: ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి వచ్చేస్తుంది..అందుకే గిన్నిస్ బుక్ లోకి..

సింగిల్ ఛార్జితో వెయ్యి కిలోమీటర్లు దాటి ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

Electric Bus: ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి వచ్చేస్తుంది..అందుకే గిన్నిస్ బుక్ లోకి..
Electric Bus
Follow us
KVD Varma

|

Updated on: Sep 13, 2021 | 10:13 PM

Electric Bus: మెర్సిడెస్ బెంజ్.. వోల్వో వంటి ఆటోమేకర్లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రేసులో పాల్గొంటున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేయడానికి తయారు చేయడానికి DPD స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్‌లతో భాగస్వామ్యమైన వాణిజ్య వాహన బ్రాండ్ అయిన యూరోప్ ఫ్యూచారికా కూడా ఈ పోటీలో ఉంది. 

ఈ బృందం రీఛార్జ్ చేయకుండానే  అత్యధిక దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ ట్రక్కును సిద్ధం చేసింది. దీంతో ఈ బస్సు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. రికార్డు కోసం, వీరు  గత 6 నెలలుగా వస్తువులను తీసుకెళ్తున్న ఇ-ట్రక్కును ఉపయోగించారు.

ఈ ఇ-ట్రక్కును మొదట ఎలక్ట్రిక్ ట్రక్కుగా మార్చడానికి వోల్వో ద్వారా సరి చేయించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ స్తే.. ఆగకుండా 1,099 కి.మీ. ప్రయాణిస్తుంది. అంటే హైదరాబాద్ లో బయలుదేరితే రాజమండ్రి వెళ్లి వచ్చేస్తుంది. 

23 గంటల్లో 392 ల్యాప్‌లను తీసుకున్న పూర్తి

ఎలక్ట్రిక్ వాహనాన్ని కాంటినెంటల్  అంతర్గత పరీక్ష కేంద్రం కాంటిండ్రోమ్‌లో 2.8 కిమీ పొడవు, ఓవల్ టెస్ట్ ట్రాక్‌పై నడిపారు. ఇద్దరు డ్రైవర్లు ఇ-ట్రక్కును నడిపారు. 23 గంటల్లో 392 ల్యాప్‌లను పూర్తి చేశారు. ట్రక్ సగటు వేగం గంటకు 50 కిమీ (31 mph). ఈ ఇ-ట్రక్ ప్రతిరోజూ దాదాపు 300 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు.

ఎలక్ట్రిక్ ట్రక్కు 680 kWh/h బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందని DPD స్విట్జర్లాండ్‌లోని స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ మార్క్ ఫ్రాంక్ చెప్పారు. ఫ్యూచర్  బ్రాండ్‌లో పనిచేసే డిజైన్ వర్క్ ప్రొడక్ట్స్ AG  CEO అడ్రియన్ మెలిగర్ మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు 680 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది యూరోప్‌లో అతిపెద్ద ట్రక్ బ్యాటరీ. 19 టన్నుల బరువున్న ట్రక్కు 680 hp కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అని తెలిపారు.