Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dyson Zone Headphones: గ్లోబల్ రేంజ్ హెడ్ ఫోన్లు ఇవి.. ప్రీమియం లుక్.. అదిరే సౌండ్ క్వాలిటీతో..

ప్రీమియం రేంజ్ హెడ్ ఫోన్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. గ్లోబల్ బ్రాండ్ డైసన్ జోన్ కొత్త హెడ్ ఫోన్లను లాంంచ్ చేసింది. ఐదేళ్ల పరిశోధన తర్వాత అభివృద్ధి చేసిన ఈ హెడ్ ఫోన్లు అధిక నాణ్యతతో పాటు, అత్యత్భుదమైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి. రెండు వేరియంట్లలో డైసన్ జోన్ ఈ హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. ఇవి నాయిస్ కాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తాయి.

Dyson Zone Headphones: గ్లోబల్ రేంజ్ హెడ్ ఫోన్లు ఇవి.. ప్రీమియం లుక్.. అదిరే సౌండ్ క్వాలిటీతో..
Dyson Zone Noise Cancellation Headphones
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2023 | 10:00 PM

ప్రీమియం రేంజ్ హెడ్ ఫోన్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్. గ్లోబల్ బ్రాండ్ డైసన్ జోన్ కొత్త హెడ్ ఫోన్లను లాంంచ్ చేసింది. ఐదేళ్ల పరిశోధన తర్వాత అభివృద్ధి చేసిన ఈ హెడ్ ఫోన్లు అధిక నాణ్యతతో పాటు, అత్యత్భుదమైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి. రెండు వేరియంట్లలో డైసన్ జోన్ ఈ హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. ఇవి నాయిస్ కాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తాయి. వీటి ధర మన దేశంలో రూ. 59,990గా ఉన్నాయి. ఈ హెడ్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డైసన్ జోన్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్లు..

బ్యాటరీ లైఫ్.. ఈ హెడ్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. యూఎస్బీ సీ చార్జింగ్ పోర్టు ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 50 గంటలకు మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు.

చార్జింగ్ టైం.. ఇది ఫుల్ చార్జ్ కావడానికి కనీసం మూడు గంటల సమయం తీసుకుంటుంది.

మైక్రోఫోన్లు.. ఈ హెడ్ ఫోన్లు 11 మైక్రోఫోన్లను కలిగి ఉంది. వీటిల్లో ఎనిమిది మైక్రోఫోన్లు ప్రత్యేకంగా నాయిస్ రిడక్సన్ కోసం పనిచేస్తాయి. 38డీబీ వరకూ నాయిస్ ను ఇవి తగ్గిస్తాయి. 3,84,000 సార్లు సౌండ్ ను సౌరౌండ్ అయ్యేలా మోనిటర్ చేస్తుంది.

సౌండ్ క్వాలిటీ..

డైసన్ జోన్ హెడ్‌ఫోన్‌లు స్వయంచాలకంగా 6హెర్జ్ నుండి 21కిలోహెర్జ్ వరకు ఫ్రీక్వెన్సీలను పునరుత్పత్తి చేస్తాయి. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, 40ఎంఎం,16-ఓమ్ నియోడైమియం స్పీకర్లతో సహా ఎలక్ట్రో అకౌస్టిక్ సిస్టమ్ వీటిల్లో ఉంటుంది. ఇది చాలా తక్కువ డిస్టార్షన్ వచ్చేలా చేస్తుంది. సెకనుకు 48,000 సార్లు జరిగే ఇంటెలిజెంట్ సిగ్నల్ ప్రాసెసింగ్, శబ్దం తగ్గింపుతో కలిపి, మొత్తం ఫ్రీక్వెన్సీ పరిధిలో (1 kHz వద్ద 94 dB వద్ద 0.08%) హార్మోనిక్ డిస్టార్షన్ ను నిర్మూలిస్తుంది. ఈ డైసన్ జోన్ హెడ్ ఫోన్లు అడాప్టివ్ కంఫర్ట్ ప్యాడ్‌లను పొందుతాయి. ఈ హెడ్‌ఫోన్‌లు వినియోగిస్తున్న వారి తలకు అన్ని వైపులా బరువును సమానంగా పంపిణీ చేస్తాయి. అందువల్ల వినియోగదారులు సౌకర్యంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా తల పైభాగంలో ఒత్తిడి లేకుండా చేస్తుందని డైసన్ కంపెనీ ప్రకటించింది.

ధ్వని కాలుష్యం.. దరి చేరదు..

డైసన్ జోన్ హెడ్‌ఫోన్‌లు “ట్రాన్స్ పరెంట్” మోడ్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. టెలిఫోనీ కోసం అదనపు మైక్రోఫోన్‌ను కలిగి ఉంది. ఇది పర్యావరణ శబ్దాన్ని అణిచివేసేటప్పుడు వాయిస్ స్పష్టతను మెరుగుపరిచేందుకు ఇది సాయపడుతుంది. అదనంగా, ఈ హెడ్‌ఫోన్‌లలో శుద్ధి చేయబడిన గాలిని ప్రొజెక్ట్ చేయడానికి రిమూవబుల్ వైజర్‌ను అమర్చవచ్చు.

మై డైసన్ యాప్‌తో కనెక్టివిటీ..

మై డైసన్ యాప్ సాయంతో ఈ హెడ్ ఫోన్లను పూర్తిగా కంట్రోల్ చేయచ్చు. ఇది వాయు ప్రవాహ వేగం, నాయిస్ తగ్గింపు మోడ్, ఆడియో ఈక్వలైజేషన్‌ని సర్దుబాటు చేయడానికి ఈ యాప్ వినియోగదారులకు ఉపకరిస్తుంది. ఇది మూడు అకౌస్టిక్ మోడ్‌లను అందిస్తుంది: డైసన్ ఈక్యూ (ఎన్ హ్యాంసెడ్), బాస్ బూస్ట్ (బేస్), న్యూట్రల్ (ఫ్లాటర్ రెస్పాన్స్ కర్వ్), వినికిడి ఆరోగ్యం కోసం వాల్యూమ్ పరిమితులు ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..