Lenovo Yoga Book: డ్యుయల్ స్క్రీన్స్‌తో లెనోవో సరికొత్త ల్యాప్ టాప్.. రెండు యాప్స్ ఒకేసారి పని చేసేలా రూపకల్పన..

| Edited By: Narender Vaitla

Jan 07, 2023 | 4:35 PM

రెండు పూర్తి పరిమాణ టచ్ స్క్రీన్స్ తో యోగా బుక్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ ల్యాప్ టాప్ ను అందుబాటులోకి రానుంది. లెనోవో యోగా బుక్ 9 ఐ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అయితే దీన్ని కంపెనీ ల్యాప్ టాప్ అని పిలుస్తున్న చూడడానికి మాత్రం ట్యాబ్ సైజ్ లో ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Lenovo Yoga Book: డ్యుయల్ స్క్రీన్స్‌తో లెనోవో సరికొత్త ల్యాప్ టాప్.. రెండు యాప్స్ ఒకేసారి పని చేసేలా రూపకల్పన..
Lenovo Yoga Book 9i
Follow us on

టాప్ కంపెనీలు డ్యుయల్ స్క్రీన్ తో ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తేవాలని గతంలో ప్రయత్నించి విఫలమయ్యాయి. గత కంపెనీల అనుభవాలను దృష్టి లో పెట్టుకుని లెనోవో తన కొత్త ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సీఈఎస్ 2023 లో ఈ మేరకు ప్రకటన చేసింది. రెండు పూర్తి పరిమాణ టచ్ స్క్రీన్స్ తో యోగా బుక్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ ల్యాప్ టాప్ ను అందుబాటులోకి రానుంది. లెనోవో యోగా బుక్ 9 ఐ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అయితే దీన్ని కంపెనీ ల్యాప్ టాప్ అని పిలుస్తున్న చూడడానికి మాత్రం ట్యాబ్ సైజ్ లో ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ల్యాప్ టాప్ డ్యూయర్ స్క్రీన్ లు వాటంతటా అవే వంగవు. కాబట్టి సమస్య ఉండదని కంపెనీ పేర్కొంటుంది. సాధారణంగా ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్నప్పడు వేరే యాప్ నుంచి మెసెజీ వస్తే చేస్తున్న పనిని ఆపేసి మినిమైజ్ చేసి ఆ మెసేజ్ చూడాల్సి వస్తుంది. కానీ యోగా బుక్ 9ఐ తో ఒకేసారి రెండు యాప్స్ పని చేస్తాయి కాబట్టి ఆ సమస్య ఉండదు. అలాగే ఈ ల్యాప్ ట్యాప్ తో కీ బోర్డు నేరుగా ఇవ్వనప్పటికీ డీటాచ్ బుల్ బ్లూ టూత్ కీ బోర్డును అందిస్తుంది. అలాగే లెనోవో స్మార్ట్ పెన్ కు ఈ ల్యాప్ ట్యాప్ సపోర్ట్ చేస్తుందని ప్రకటించింది. 

లెనోవో యోగా బుక్ 9 ఐ ఫీచర్స్

ఈ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే, యోగా బుక్ 9i OLED స్క్రీన్‌లు 13.3-అంగుళాలతో ఉన్నాయి. అలాగే 2.8 కే రిజుల్యూషన్ 2880×1800 అవుట్ ఇమెజ్ ను సపోర్ట్ చేస్తుంది. డీసీఐ పీ3 కలర్స్ స్టెబిలైజేషన్ తో డాల్బీ విజన్ హెచ్ డీఆర్ ఫీచర్స్ తో శక్తివంతమైన, వివరణాత్మక విజువల్స్‌ను అందిస్తాయి.  అలాగే డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో తో బోవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ బార్‌తో వస్తుంది. అలాగే 13 జనరేషన్, ఐ 7 ప్రాసెసర్ వస్తుంది. అయితే ఇది గేమింగ్ అంతగా పని చేయదు. కేవలం విద్యా, ఉద్యోగ అవసరాల నిమిత్తమే దీన్ని రూపొందించనట్లు కంపెనీ ప్రకటింది. దీని బ్యాటరీ గరిష్టంగా 10 గంటలు చార్జ్ ఉండేలా చేస్తుంది. 16 జీబీ ర్యామ్ తో 1 టీబీ స్టోరేజ్ తో అందుబాటులో ఉండనుంది. అలాగే దీని ధర మాత్రం బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ ల్యాప్ టాప్ యూఎస్ లోనే $2,099.99 ప్రారంభ ధరతో ఉంటుందని, అలాగే ఈ ల్యాప్ టాప్ జూన్ 2023 నుంచి డెలివరీ చేస్తామని ప్రకటించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..