Tech Tips: ల్యాప్‌టాప్‌తో ఫోన్‌ ఛార్జ్ చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే.. మరోసారి ఆ తప్పు..

ఆఫీసులో పనిచేసేటప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా మంది ల్యాప్‌టాప్‌తో ఫోన్‌ ఛార్జ్ చేస్తారు. కానీ మీ ల్యాప్‌టాప్ నుండి మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు. అసలేం జరుగుతుందో మీకు తెలిస్తే.. మరోసారి మీరు ఈ తప్పు చేయరు.

Tech Tips: ల్యాప్‌టాప్‌తో ఫోన్‌ ఛార్జ్ చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే.. మరోసారి ఆ తప్పు..
Phone Charging With Laptop

Updated on: Sep 05, 2025 | 2:51 PM

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఏ పనైనా ఫోన్‌ చేతిలో ఉంటే సరిపోతుంది. కొద్దిసేపు ఫోన్ లేకపోతే అంతా అల్లకల్లోలంగా అనిపిస్తుంది. అందుకే ఫోన్ బ్యాటరీ అయిపోతున్నప్పుడు చాలామంది దాన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆఫీసులో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయడం ఎంతవరకు సురక్షితమో మీకు తెలుసా? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నెమ్మదిగా ఛార్జింగ్ – బ్యాటరీపై ప్రభావం

మీరు ఫోన్‌ను దాని అసలు ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు అది వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ ఛార్జర్లు సాధారణంగా 2A లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను అందిస్తాయి. కానీ ల్యాప్‌టాప్‌లోని యూఎస్‌బీ పోర్ట్‌ల ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేస్తే వేగం చాలా తగ్గుతుంది. ఎందుకంటే చాలా ల్యాప్‌టాప్‌ల 3.0 USB పోర్ట్ కేవలం 0.5A మాత్రమే ఇస్తుంది. అలాగే USB 3.0 పోర్ట్ 0.9A విద్యుత్‌ను అందిస్తుంది. ఈ తక్కువ వోల్టేజ్, విద్యుత్ సరఫరా వల్ల ఫోన్ బ్యాటరీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనివల్ల బ్యాటరీ పనితీరు, జీవితకాలం తగ్గుతాయి.

వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్ ప్రమాదం

ల్యాప్‌టాప్ నుండి ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవ్వడం వల్ల మనం దాన్ని ఎక్కువసేపు కనెక్ట్ చేసి ఉంచుతాము. దీనివల్ల ఫోన్ వేడెక్కడం మొదలవుతుంది. ఈ వేడి బ్యాటరీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చివరికి బ్యాటరీ దెబ్బతింటుంది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ అవుతున్నప్పుడు మీరు ఫోన్‌ను కనెక్ట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ రెండు పరికరాల విద్యుత్ నిర్వహణ సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది.

డేటా చోరీ, వైరస్‌ల ప్రమాదం

ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసినప్పుడు డేటా ట్రాన్స్‌ఫర్ కూడా ప్రారంభమవుతుంది. మీ ల్యాప్‌టాప్‌లో ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ ఉంటే అది మీ ఫోన్‌లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే మీరు మీ ఫోన్‌ను వేరొకరి ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ కోసం కనెక్ట్ చేసినప్పుడు మీ వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదం కూడా పెరుగుతుంది.

ల్యాప్‌టాప్ బ్యాటరీపై ప్రభావం

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీతో నడుస్తున్నప్పుడు మీరు ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఇది ల్యాప్‌టాప్ బ్యాటరీ జీవితకాలంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఈ కారణాలన్నీ చూస్తే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయకపోవడమే ఉత్తమం. మీ ఫోన్, ల్యాప్‌టాప్ రెండూ సురక్షితంగా ఉండాలంటే ఎల్లప్పుడూ వాటి అసలు ఛార్జర్లనే ఉపయోగించండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..