Pak Cyber Attack: పాక్‌ కుట్రలు.. పొరపాటున ఈ ఫైళ్లపై క్లిక్ చేయకండి.. ప్రమాదంలో పడిపోతారు!

పాకిస్తాన్ దాడులన్నింటినీ భారతదేశం తిప్పి కొడుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రను పన్నుతోంది. ఆ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంపై సైబర్ దాడికి సిద్ధమవుతోందని, దీని కోసం, డాన్స్ ఆఫ్ ది హిల్లరీ

Pak Cyber Attack: పాక్‌ కుట్రలు.. పొరపాటున ఈ ఫైళ్లపై క్లిక్ చేయకండి.. ప్రమాదంలో పడిపోతారు!

Updated on: May 09, 2025 | 2:47 PM

భారతదేశంలో శాంతి ఉన్నప్పటికీ పాకిస్తానీలకు అది ఎల్లప్పుడూ కడుపులో నొప్పి. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్‌ కారణమని భారతదేశం పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ వెక్కిరింపులు కొనసాగుతున్నాయి. దీంతో భారత్‌ పాక్‌కు కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పాక్‌ భారతదేశంపై నేరుగా డ్రోన్ దాడులను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. కానీ భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని అడ్డుకుని ఎదురుదెబ్బ కొడుతోంది.

పాకిస్తాన్ దాడులన్నింటినీ భారతదేశం తిప్పికొట్టింది, ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రను పన్నుతోంది. ఆ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంపై సైబర్ దాడికి సిద్ధమవుతోందని, దీని కోసం, డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే ప్రమాదకరమైన వైరస్‌ను ఒక ఫైల్‌లో ఉంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

మీరు WhatsApp, Facebook, Telegram లేదా ఇమెయిల్‌లో తెలియని ఫైల్ లేదా లింక్‌ను చూసినట్లయితే, పొరపాటున దానిపై క్లిక్ చేయకండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు చాలా ఖరీదైనది కావచ్చు. ఈ ఫైల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించే మాల్వేర్ ఉంది.

డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అంటే ఏమిటి?

ఇది వీడియో ఫైల్స్, డాక్యుమెంట్ల రూపంలో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన మాల్వేర్. ఈ మాల్వేర్ మీ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అది యాక్టివ్‌గా మారుతుందని, మీ బ్యాంకింగ్ వివరాలు దొంగిలించబడే ప్రమాదాన్ని పెంచుతుందని భద్రతా నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ తెలియని లింక్ లేదా అటాచ్మెంట్ రూపంలో మిమ్మల్ని చేరుకోవచ్చు. మీరు tasksche.exe అనే ఫైల్‌ను కనుగొంటే, ఆ ఫైల్‌పై క్లిక్ చేయడంలో పొరపాటు చేయకండి.

మాల్వేర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

  • యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించండి.
  • మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తాజాగా ఉంచండి.
  • అనుమానాస్పద లింక్‌లు, అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
  • బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.
  • ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్
  • మీరు అనుకోకుండా తెలియని ఫైల్‌పై క్లిక్ చేసి ప్రమాదంలో పడినట్లయితే వెంటనే 1930 (నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్) కు కాల్ చేసి, మీకు జరిగిన విషయాన్ని చెబుతూ ఫిర్యాదు చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి