
భారతదేశంలో ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన కేవైసీ డాక్యుమెంట్‌లలో ఒకటిగా పరిణామం చెందింది. ఇది గుర్తింపు రుజువుగా మాత్రమే కాకుండా భారతదేశంలో వివిధ ప్రభుత్వ రాయితీలు, పథకాలను యాక్సెస్ చేయడానికి కీలకంగా మారింది. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడం లేదా మొబైల్ సిమ్ కార్డ్ పొందడం వరకు అనేక రకాల సేవలకు ఇది తప్పనిసరైంది. ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆధార్‌ను బ్లూ ఆధార్ లేదా బాల్ ఆధార్ అని పిలుస్తారు. 2018లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రత్యేకంగా ఐదేళ్లలోపు పిల్లల కోసం రూపొందించిన బ్లూ ఆధార్ భావనను ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేకమైన ఐడీ కార్డ్ ప్రత్యేకంగా నీలం రంగులో ఉంటుంది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో చిన్న పిల్లలను చేర్చడాన్ని సులభతరం చేస్తుంది. ఈ బ్లూ ఆధార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్లూ ఆధార్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ డేటాను అందించాల్సిన అవసరం లేకుండా జారీ చేస్తారు. యూఐడీఏఐ జనాభా సమాచారం, వారి తల్లిదండ్రుల యూఐడీకు లింక్ చేసిన ముఖ చిత్రం ఆధారంగా ప్రాసెస్ చేయవచ్చు. బ్లూ ఆధార్ వచ్చిన వారు తప్పనిసరిగా 5 నుంచి 15 సంవత్సరాల వయస్సులో వారి వేళ్లు, కనుపాప, ముఖ ఫోటో బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలి. ఒకవేళ అప్‌డేట్ చేయడంలో విఫలమైతే పిల్లల వయస్సు వచ్చిన తర్వాత కార్డ్ దాని చెల్లుబాటును కోల్పోతుంది. అయితే ఆధార్ సబ్‌స్క్రైబర్‌ల కోసం బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేసే ప్రక్రియ ఉచితంగా ఉంటుంది.
యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం తల్లిదండ్రులు తమ నవజాత శిశువుల కోసం బ్లూ ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు సమయంలో ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్‌గా జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ని ఉపయోగించడానికి ప్రక్రియ అనుమతిస్తుంది. పిల్లల కోసం నీలిరంగు ఆధార్ కార్డును కలిగి ఉండటం వల్ల అనేక ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అనువుగా ఉంటాయి. మోసపూరిత, చట్టబద్ధమైన విద్యార్థుల మధ్య తేడాను గుర్తించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తూ పిల్లలకు మధ్యాహ్న భోజన సేవలను అందించడంలో ఇది సులభతరం చేస్తుంది. అంతేకాకుండా చాలా పాఠశాలలు ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియలో బ్లూ ఆధార్ కార్డుల ప్రదర్శనను తప్పనిసరి చేస్తున్నాయి. కాబట్టి నమోదు చేయడం ఎలా? అనేది ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి