Study: బీర్ రుచిపై వాతావరణ మార్పు ప్రభావం.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

|

Oct 13, 2023 | 3:28 PM

వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు, వేడి, ఎక్కువ కాలం పొడి వాతావారణం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దీంతో రానున్న రోజుల్లో బీర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2050 నాటికి యూరోపియన్‌ ప్రాంతాల్లో హోప్‌ దిగుబడి 4 నుంచి 18 శాతం తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే రైతులు తమ వ్యవసాయ...

Study: బీర్ రుచిపై వాతావరణ మార్పు ప్రభావం.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
Beer's Quality
Follow us on

వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతల కారణంగా బీరు రుచి, నాణ్యతలో మార్పులు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ఈ విషయాలను పరిశోధకులు ప్రచురించారు. యూరప్‌లో పండే హోప్‌ (ఒక రకమైన పూలు)ల నాణ్యత తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. బీరుకు ఒకరైన చేదు రుచిని అందించడంలో హోప్‌ను ఉపయోగిస్తారు.

వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులు, వేడి, ఎక్కువ కాలం పొడి వాతావారణం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దీంతో రానున్న రోజుల్లో బీర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2050 నాటికి యూరోపియన్‌ ప్రాంతాల్లో హోప్‌ దిగుబడి 4 నుంచి 18 శాతం తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే రైతులు తమ వ్యవసాయ పద్ధతులను సర్దుబాటు చేసుకోవాలని పరిశోధకులు రైతులను కోరారు.

బీరు తయారీలో నీరు, ఈస్ట్‌, మాల్ట్‌తో పాటు ఉపయోగించే మరో పదార్థమే ఈ హోప్‌. పరిశోధనల ప్రకారం కొన్ని హోప్‌ పెరుగుఉన్న ప్రాంతాల్లో దాదాపు 20 శాతం తగ్గుదల కనిపించింది. చెక్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (CAS), కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వాతావరణంలో మార్పుల కారణంగా హోప్‌ దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. హోప్‌ దిగుబడి తగ్గడంతో రానున్న రోజుల్లో బీర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా తర్వాత బీరు ధరలు సుమారు 13 శాతం పెరిగాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు హోప్‌లోని ఆల్ఫా బిట్టర్‌ యాసిడ్స్‌లో తగ్గుదులకు దారితీశాయని, బీర్‌ రుచి మారడానికి ఇదే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. వాతావరణంలో జరుగుతోన్న మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, మనుషులు చేస్తున్న పనుల కారణంగా గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఉష్ణోగ్రతలను పెంచుతూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడిప్పుడే రైతులు హోప్‌ దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పండించడం, నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఏదిఏమైనా భవిష్యత్తుల్లో హోప్‌ ఉత్పత్తి క్షీణతను భర్తీ చేయాలంటే వాటి ఉత్పత్తిని 20 శాతం విస్తరించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..