ZTE New Smartphone: కంప్యూటర్‌ల వేగాన్ని తలపించనున్న స్మార్ట్ ఫోన్‌లు.. ఏకంగా 20 జీబీ ర్యామ్‌ ఫోన్‌ తయారీ?

|

Jul 03, 2021 | 8:50 AM

ZTE New Smartphone: స్మార్ట్‌ ఫోన్ల తయారీ రంగంలో రోజుకో సంచలనం నమోదవుతుంది. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తూ మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ పనితీరును..

ZTE New Smartphone: కంప్యూటర్‌ల వేగాన్ని తలపించనున్న స్మార్ట్ ఫోన్‌లు.. ఏకంగా 20 జీబీ ర్యామ్‌ ఫోన్‌ తయారీ?
Zte 20gb Ram Phone
Follow us on

ZTE New Smartphone: స్మార్ట్‌ ఫోన్ల తయారీ రంగంలో రోజుకో సంచలనం నమోదవుతుంది. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తూ మొబైల్‌ కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే పనిలో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ పనితీరును మెరుగు పరిచే ర్యామ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ ర్యామ్‌తో కూడిన ఫోన్‌లను తయారు చేసే పనిలో పడుతున్నాయి. ఒకప్పుడు 2 జీబీ ర్యామ్‌ ఉండే ఫోన్లను గొప్పగా చూసే వారు. కానీ ఇప్పుడు ఏకంగా 18 జీబీ ర్యామ్‌లు వస్తున్నాయి. తాజాగా అసుస్, లెనోవో 18 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లను మార్కె్ట్లోకి లాంచ్‌ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ జెడ్‌టీఈ ఏకంగా 20 జీబీ ర్యామ్‌తో కూడిన ఓ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆన్‌లైన్‌లో సమాచారాన్ని లీక్‌ చేశారు. అత్యంత మెరుగైన ర్యామ్‌ తీసుకురావడం వల్ల జడ్‌టీఈ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనివ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో 1 టీబీ స్టోరేజ్‌ను తీసుకువచ్చే అవకాశాలున్నయాని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: WhatsApp New Feature: యూజర్ల కోరిక మేరకు కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై వీడియోలను..

అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించిన గుంటూరు యువతి

Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?