Second Hand Cars: సెకండ్ హ్యాండ్ ఢిల్లీ కారు కొంటున్నారా? అయితే కచ్చితంగా ఇవి చెక్ చేయండి

| Edited By: Velpula Bharath Rao

Nov 26, 2024 | 7:30 PM

కొత్త కార్లకు పోటీగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అందరికీ అన్ని బడ్జెట్లలో సెకండ్ హ్యాండ్ కార్లు లభిస్తుండడంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరులో ఉంది. హైదరాబాదు లాంటి మెట్రో సిటీలో గల్లీకో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ కోసం ఈ సెకండ్ హ్యాండ్ షోరూమ్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఎంచుకుంటున్నారు. తక్కువ ధరల్లో కార్లు దొరుకుతుండడం, దీంతోపాటు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా బ్యాంకులు లోన్లు ఇస్తుండడం సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెరగడానికి కారణం అని చెప్పవచ్చు.

Second Hand Cars: సెకండ్ హ్యాండ్ ఢిల్లీ కారు కొంటున్నారా? అయితే కచ్చితంగా ఇవి చెక్ చేయండి
Check These Before Buying Second Hand Delhi Cars
Follow us on

ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా కారు అవసరంగా మారిపోయింది. కొత్త కార్లకు పోటీగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అందరికీ అన్ని బడ్జెట్లలో సెకండ్ హ్యాండ్ కార్లు లభిస్తుండడంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరులో ఉంది. హైదరాబాదు లాంటి మెట్రో సిటీలో గల్లీకో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్ కోసం ఈ సెకండ్ హ్యాండ్ షోరూమ్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఎంచుకుంటున్నారు. తక్కువ ధరల్లో కార్లు దొరుకుతుండడం, దీంతోపాటు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా బ్యాంకులు లోన్లు ఇస్తుండడం సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెరగడానికి కారణం అని చెప్పవచ్చు.

ఈ మధ్యనే ఢిల్లీ కార్లు అంటూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో అమ్మకాలు జరుపుతున్నారు. ఇక్కడ దొరికే కార్ల కంటే చాలా చౌక అంటూ సోషల్ మీడియాలో పెట్టి మరి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇక్కడికంటే 30-40 శాతం తక్కువ ధరకు ఢిల్లీ కార్లు దొరుకుతుండడంతో చాలామంది కొంటున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది మోసాలకు గురవుతున్నారు. ఈ కార్లను కొనే ముందు అంత తక్కువకు ఎందుకు వస్తుంది… ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయని ముందే గుర్తించాలి. కారును మెకానిక్ వద్దకు తీసుకెళ్లిన సెకండ్ హ్యాండ్ డీలర్లకు ఆ చుట్టుపక్కల ఉండే మెకానిక్‌లకు ఉన్న రిలేషన్‌తో అంతగా వివరాలు తెలియవు.
ఈ సింపుల్ టెక్నిక్స్‌తో చీటింగ్ నుంచి ఇట్టే బయటపడవచ్చు.

1. సీట్ బెల్ట్ పైన ఉన్న మేకింగ్ డేట్ ఇయర్ చెక్ చేయండి. అలాగే ఫ్రంట్ సీట్ కింద వెనకాల ఉన్న ఐరన్ ఫ్రేమ్ పైన కూడా సేమ్ మేకింగ్ ఇయర్ ఉండాలి. లేకపోతే అది యాక్సిడెంట్‌కి గురైనట్లుగా గుర్తించొచ్చు.

2. స్టీరింగ్ రాడ్ మొత్తం పరిశీలించండి. ఇంజన్ పైన ఉన్న బ్యానెట్ ఓపెన్ చేసి కూడా లోపలికి చూడండి. మంచి వెలుతురులో దీన్ని పరిశీలిస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఏమాత్రం స్టీరింగ్ రాడ్ తుప్పు పట్టినట్లుగా, ఆయిల్ కారుతున్నట్లుగా కనిపించిన అది వరదల్లో మునిగిపోయిందని అర్థం. లేదా రోడ్డు ప్రమాదం జరిగిందని గ్రహించాలి.

3. ఇక రెండు ఫ్రెంట్ డోర్లకు ఉన్న స్క్రూ ఫిట్టింగ్ జాగ్రత్తగా గమనించండి. ఆ స్క్రూ ఫిట్టింగ్ కనుక ఒకసారి ఓపెన్ చేసినట్లయితే దానికి ఉన్న ప్లాస్టిక్ లాక్స్ ఊడిపోతాయి. ఆ లాక్స్ ఊడిపోతే ఆ డోర్లు మార్చినట్టు.

4. ఇంజన్ మొత్తాన్ని కాసేపు ఆన్ చేసి బ్యానెట్ ఓపెన్ చేసి చూడండి. ఆయిల్ లీకేజీలు ఏమున్నా… పది నిమిషాల తర్వాత ఇంజన్ ఆయిల్ క్యాప్ నల్లగా మారిన ఆ కారు జోలికి వెళ్ళకండి.

5. ఒక బ్యానర్ మొత్తాన్ని చేతితో పూర్తిగా తడిమి చూడండి. ఎక్కడైనా జాయింట్స్, వెల్డింగ్స్ కనిపిస్తే అది రిపేర్ అయినట్లే… ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే బ్యానర్ ఏది కూడా ఒకే ఐరన్ షీట్ తో తయారు చేయబడి ఉంటుంది.

ఇలా ఈ చిన్న చిన్న టెక్నిక్స్‌తో పాటు ఐదు నుంచి పది కిలోమీటర్లు ఆ వెహికల్‌ని డ్రైవ్ చేసి చూడండి. అప్పుడు మీకే ఇంకొన్ని డిఫెక్ట్స్ ఉంటే అర్థమవుతాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలంటూ అక్కడ మీటర్ రీడింగ్‌ని ట్యాంపరింగ్ చేసి మరి తక్కువ కిలోమీటర్ల చూపిస్తూ అమ్ముతున్నారు. ఇప్పుడు చాలా యాప్స్ లో కారుకు సంబంధించిన షోరూం ట్రాక్ దొరుకుతుంది. 500 రూపాయలు కడితే ఏ కారు షోరూం ట్రాక్ అయినా అందజేస్తున్నారు. కాబట్టి కారు నచ్చితే ఒకసారి షో రూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి. ఇది కేవలం ఢిల్లీ కార్ల విషయంలోనే కాదు ఏ సెకండ్ హ్యాండ్ కారులోనైనా ఇలానే చెక్ చేయాలి. సురక్షితంగా మీరు పెట్టిన ప్రతి రూపాయిని కారు విషయంలో ఎంజాయ్ చేయాలంటే కాస్త ఓపిగ్గా ఈ అంశాలు అన్నిటినీ పరిశీలించండి.