
ఇప్పుడంటే రీఛార్జ్ ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలా మంది ఒక్కటే సిమ్ వాడుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రెండు సిమ్‌లు వాడుతున్నారు. కానీ, గతంలో ఎన్ని సిమ్‌లంటే అన్ని సిమ్‌లు వాడేవారు. ఆఫర్ల కోసం సిమ్‌లు తీసుకొని వాడుకొని పడేసేవారు. ఒకరి సిమ్ ఇంకొకరికి ఇచ్చేసేవారు. అలా ఒకరి పేరు మీద ఉన్న సిమ్ మరొకరు వాడొచ్చా? అలా వాడితే ఏమవుతుంది?
ప్రస్తుతం ఫోన్ల ద్వారానే.. అమాయకులకు గాలమేసి ఆన్‌లైన్‌లో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇతరుల గుర్తింపుకార్డులు వినియోగించి సిమ్‌లు పొందుతూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మీ పేరుతో ఎవరైనా అక్రమంగా సిమ్ తీసుకున్నారా? అనేది తెలుసుకోవడానికి.. గతంలో మీరు వినియోగించి వదిలేసిన కనెక్షన్.. ఇంకా మీ పేరుతోనే ఉందేమో తెలుసుకోవడానికి ఓ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ (డీవోటీ).
TAFCOP సైట్‌లోకి వెళితే ‘నో (know) మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మొబైల్ నంబర్, క్యాప్చాను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే మీ పేరిట ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెరపై ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ మీరు వినియోగించే కనెక్షన్లు కాకుండా వేరే ఏమైనా ఉన్నట్లు కనిపిస్తే అక్కడే రిపోర్ట్ చేయొచ్చు. మీరు వినియోగించని నంబర్ పక్కన ఉండే బాక్స్‌లో టిక్ చేసి ‘నాట్ మై నంబర్’ పై క్లిక్ చేస్తే డీవోటీలో ఫిర్యాదు నమోదవుతుంది. అలాగే గతంలో వినియోగించి వదిలేసిన కనెక్షన్.. ఇంకా మీ పేరుపైనే ఉన్నా ‘నాట్ రిక్వైర్డ్’ అని క్లిక్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి