Cheapest water geysers: తక్కువ ధరలో వాటర్‌ గీజర్ కోసం చూస్తున్నారా.? ఈ బెస్ట్ డీల్స్‌ మీ కోసమే..

రానున్నది చలి కాలం దీంతో స్నానానికి వేడి నీరు అవరసం పడుతుంది. అయితే నీటిని వేడి చేయడానికి ఒకప్పుడు వాటర్‌ హీటర్స్‌ను ఉపయోగించే వారు. వీటిని ఉపయోగించడం కాస్త ఇబ్బంది, ప్రమాదంతో కూడుకున్న విషయం. అలా కాకుండా వాటర్‌ గీజర్స్‌ అయితే సులభంగా వేడి నీటిని రడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పండక్కి వాటర్‌ గీజర్‌ను కొనుగోలు చేసే ఆలోచనతో ఉన్నారా.? అయితే అమెజాన్ సేల్‌లో...

Cheapest water geysers: తక్కువ ధరలో వాటర్‌ గీజర్ కోసం చూస్తున్నారా.? ఈ బెస్ట్ డీల్స్‌ మీ కోసమే..
Water Geyser
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2023 | 10:24 PM

రానున్నది చలి కాలం దీంతో స్నానానికి వేడి నీరు అవరసం పడుతుంది. అయితే నీటిని వేడి చేయడానికి ఒకప్పుడు వాటర్‌ హీటర్స్‌ను ఉపయోగించే వారు. వీటిని ఉపయోగించడం కాస్త ఇబ్బంది, ప్రమాదంతో కూడుకున్న విషయం. అలా కాకుండా వాటర్‌ గీజర్స్‌ అయితే సులభంగా వేడి నీటిని రడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ పండక్కి వాటర్‌ గీజర్‌ను కొనుగోలు చేసే ఆలోచనతో ఉన్నారా.? అయితే అమెజాన్ సేల్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్నొ కొన్ని బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..

AO Smith EWS-3: రూ. 3 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాటర్‌  గీజర్స్ లో AO Smith EWS-3 Glass Lined 3 Litre 3KW Instant Water Heater ఒకటి. ఈ గీజర్‌ అసలు ధర రూ. 5,2500గా ఉండగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా 46 శాతం డిస్కౌంట్‌తో ర. 2,799కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్‌ సైతం అందిస్తున్నారు. ఇక ఈ గీజర్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 3 లీటర్స్‌ కెపాసిటీతో ఉండే ఈ గీజర్‌ 3000 వాట్స్‌ పవర్‌తో పని చేస్తుంది. ఇన్నర్‌ ట్యాంక్‌కు 5 ఏళ్లు వారంటీ ఇస్తున్నారు. గీజర్‌ మొత్తం బరువు 4.2 కిలోలు ఉంది.

Bajaj Splendora: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బజాజ్‌ కంపెనీకి చెందిన Bajaj Splendora 3 Litre 3KW IWH Instant Water Heater వాటర్‌ గీజర్‌ అసలు ధర రూ. 5,800కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,399కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు. ఇక ఈ గీజర్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే.. 3 లీటర్స్‌ కెపాసిటీగల ఈ గీజర్‌లో కాపర్‌ హీటింగ్ ఎలిమెంట్‌ను ఇచ్చారు. మెటల్‌ బాడీతో రూపొందిన ఈ వాటర్‌ గీజర్‌ బరువు 2 కిలోలకుపైగా ఉంది.

Crompton Instabliss: ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లకు పెట్టింది పేరైన క్రాంప్టన్‌ బ్రాండ్‌కు చెందిన Crompton Instabliss 3-L Instant Water Heater ను తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్‌ కల్పిస్తోంది. ఈ గీజర్‌ అసలు ధర రూ. 2399కాగా, 45 శాతం డిస్కౌంట్‌తో రూ. 2399కే సొంతం చేసుకోవచ్చు. 3 లీటర్స్‌ కెపాసిటీతో రూపొందించిన ఈ గీజర్‌ 3000 వాట్స్‌ పవర్‌తో పని చేస్తుంది. కంపెనీ 5 ఏళ్లు వారంటీ అందిస్తోంది. అటోమెటిక్‌ థర్మల్‌ కట్‌ అవుట్‌, ప్రెసర్‌ రిలీజ్‌ వంటి ఫీచర్స్‌ను ఇందులో అందించారు. యాంటీ రస్ట్ టెక్నాలజీ ఈ గీజర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

V-Guard: తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో వాటర్‌ గీజర్‌ వీ గార్డ్‌ కంపెనీకి చెందిన.. V-Guard Zio Instant Water Geyser. ఈ గీజర్‌ అసలు ధర రూ. 4,700కాగా 49 శాతం డిస్కౌంట్‌తో రూ. 2399కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. పవర్‌ఫుల్ ఇన్‌స్టంట్‌ హీటింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చిన ఈ వాటర్‌ గీజర్‌లో అడ్వాన్స్‌డ్‌ 4 లేయర్‌ సేఫ్టీని అందించారు. ఎనర్జీ ఎఫిషియెంట్‌గా పనిచేసే ఈ వాటర్‌ గీజర్‌పై కంపెనీ రెండేళ్ల వారంటీ ఇస్తోంది.

Havells: మరో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హావెల్స్‌ గీజర్‌పై కూడా మంచి డీల్‌ లభిస్తోంది. Havells Instanio 1-Litre 3KW Instant Water Heater అసలు ధర రూ. 4,560కాగా 41 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 2699కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇది కేవలం 1 లీటర్‌ కెపాసిటీ కావడం గమనార్హం. ఇందులో 3 లీటర్స్‌, 6 లీటర్స్‌ కెపాసిటీ వేరియంట్స్‌ కూడా ఉన్నాయి. 3000 వాట్స్‌ పవర్‌తో పనిచేసే ఈ ఇన్‌స్టాంట్ గీజర్‌లో టెంపరేచర్‌ సెన్సింగ్ కలర్‌ చేంజింగ్ ఎల్‌ఈడీ ఇండికేటర్‌ను అందించారు. రస్ట్‌, షాక్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో అవుటర్‌ బాడీని రూపొందించారు. నీరు వేడెక్కడానికి కాపర్‌ హీటింగ్ ఎలిమెంట్‌ టెక్నాలజీని అందించారు. ఇక ప్రొడక్ట్‌పై కంపెనీ 5 ఏళ్‌లు వారంటీ అందిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!