
Chatgpt Advice: టెక్నాలజీ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిది అందులోనే సలహాలు అడిగేస్తున్నారు. ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సలహా తీసుకోవడమే కొంపముంచినట్లు అయ్యింది. దీంతో ఆ వ్యక్తి మూడు వారాల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో AI నుండి చికిత్స లేదా వైద్య సలహా తీసుకోవడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరించారు. ఎందుకంటే ఇది ఇంకా వైద్యుడిని భర్తీ చేసేంతగా అభివృద్ధి చెందలేదని, భవిష్యత్తులో AI వైద్యులను భర్తీ చేసినా, ఇప్పుడు దానిని విశ్వసించడం ప్రమాదకరం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికకు తాజా ఉదాహరణ న్యూయార్క్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కేసు. ChatGPT ఇచ్చిన తప్పుడు సలహా కారణంగా అతను మూడు వారాల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇది కూడా చదవండి: iPhone 15: ఆపిల్ ప్రియులకు కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ.32 వేలకే ఐఫోన్ 15
ఆ తప్పు ఎలా జరిగింది?
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి తన ఆహారం నుండి ఉప్పు (సోడియం క్లోరైడ్)ను ఎలా తొలగించాలో ChatGPTని అడిగాడు. AI ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించమని సూచించింది. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో కొన్ని మందులలో ఉపయోగించారు. కానీ ఇప్పుడు పెద్ద పరిమాణంలో విషపూరితంగా పరిగణిస్తున్నారు.
ఈ సలహా మేరకు ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో సోడియం బ్రోమైడ్‌ను కొనుగోలు చేసి, మూడు నెలల పాటు ఉప్పుకు బదులుగా తన ఆహారంలో వాడాడు. ఈ సమయంలో అతను వైద్య సలహా తీసుకోలేదు. ఇది అతని ఆరోగ్యానికి చాలా హాని కలిగించింది.
తీవ్రమైన లక్షణాలు:
సోడియం బ్రోమైడ్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తీవ్రమైన భయం, గందరగోళం, తీవ్రమైన దాహం, మానసిక గందరగోళం వంటి అనేక తీవ్రమైన సమస్యలు రావడం ప్రారంభించాయి. అతని పరిస్థితి చాలా దిగజారింది. పరీక్షలో అతను బ్రోమైడ్ విషప్రయోగానికి గురైనట్లు తేలింది.
వైద్యులు ప్రాణాలను కాపాడారు:
ఆసుపత్రిలో వైద్యులు అతని శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను సరిచేశారు. దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత అతని శరీరంలో సోడియం, క్లోరైడ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. అతను డిశ్చార్జ్ అయ్యాడు.
AI వైద్య సలహాను నమ్మవద్దు:
అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కేసు, ఆరోగ్యం, పోషకాహారానికి సంబంధించిన విషయాలపై వైద్య నిపుణుడిని సంప్రదించకుండా AI సలహాను పాటించడం ప్రమాదకరమని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఉప్పు లేదా ఇతర ముఖ్యమైన పోషకాలను మార్చడం విషయానికి వస్తే AI కంటే వైద్య నిపుణుడిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి: Jio Plan: జియోలో రూ.189 చౌకైన ప్లాన్.. డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, వ్యాలిడిటీ ఎంతో తెలుసా?
ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ 1గా నిలిచిన ఎలక్ట్రిక్ స్కూటర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి