Chat GPT Support: త్వరలో ఐఫోన్‌లో కూడా చాట్ జీపీటీ సేవలు.. ఐఓఎస్ 18లోనే లాంచ్..?

|

May 15, 2024 | 4:45 PM

తాజాగా యాపిల్ కంపెనీ కూడా దాని పరికరాలకు కృత్రిమ మేధస్సు లక్షణాలను తీసుకురావడానికి విస్తృత పుష్‌లో భాగంగా ఐఫోన్‌లో చాట్ జీపీటీను ఉంచడానికి యాపిల్ ఓపెన్ ఏఐతో ఒక ఒప్పందాన్ని ముగించింది. ఆపిల్‌కు సంబంధించిన తదుపరి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన యాపిల్ ఐఓఎస్ 18లో చాట్ జీపీటీ ఫీచర్లను ఉపయోగించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కోసం నిబంధనలను ఖరారు చేస్తున్నాయి.

Chat GPT Support: త్వరలో ఐఫోన్‌లో కూడా చాట్ జీపీటీ సేవలు.. ఐఓఎస్ 18లోనే లాంచ్..?
Chat Gpt
Follow us on

ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ అనేది సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ సేవలను అన్ని కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ కూడా దాని పరికరాలకు కృత్రిమ మేధస్సు లక్షణాలను తీసుకురావడానికి విస్తృత పుష్‌లో భాగంగా ఐఫోన్‌లో చాట్ జీపీటీను ఉంచడానికి యాపిల్ ఓపెన్ ఏఐతో ఒక ఒప్పందాన్ని ముగించింది. ఆపిల్‌కు సంబంధించిన తదుపరి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన యాపిల్ ఐఓఎస్ 18లో చాట్ జీపీటీ ఫీచర్లను ఉపయోగించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కోసం నిబంధనలను ఖరారు చేస్తున్నాయి. యాపిల్ సంస్థకు సంబందించిన జెమినీ చాట్‌బాట్‌కు లైసెన్స్ ఇవ్వడం గురించి ఆల్ఫాబెట్ ఐఎన్‌సీకు సంబంధించిన గూగుల్‌తో కూడా చర్చలు జరిపింది. ఆ చర్చలు ఒప్పందానికి దారితీయలేదు. ఈ నేపథ్యంలో యాపిల్ ఫోన్స్‌లో ఐఓఎస్ సేవలను గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వచ్చే నెలలో ప్రకటించాలని యోచిస్తున్న కొత్త ఏఐ ఫీచర్లలో భాగంగా యాపిల్ ప్రముఖ చాట్‌బాట్‌ను అందించడానికి ఓపెన్ ఏఐ ఒప్పందం అనుమతిస్తుంది. అయితే ఈ ఫీచర్‌లు, ఇంటిగ్రేషన్‌లు ఎలా పని చేస్తాయనే దాని గురించి మరిన్ని వివరాలు ప్రస్తుతానికి అస్పష్టంగానే ఉన్నాయి. ఐఓఎస్ 18కు సంబంధించిన ఏఐ  ఫీచర్లు యాపిల్ సిలికాన్ ప్రాసెసర్‌లతో కూడిన యాపిల్ డేటా సెంటర్‌ల ద్వారా (పాక్షికంగా) శక్తిని పొందుతాయని ఓపెన్ ఏఐ వివరించింది. అయితే ఐఓఎస్ 18కు సంబంధించిన ఏఐ ఫీచర్లు చాలా వరకు పూర్తిగా పరికరంలోనే ఉంటాయి. ఇది యాపిల్ గోప్యత మరియు వేగ ప్రయోజనాలను తెలియజేయడానికి అనుమతిస్తుంది.

గత సంవత్సరం టిమ్ కుక్, యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాను వ్యక్తిగతంగా ఓపెన్ ఏఐకు సంబంధించిన చాట్ జీపీటీను ఉపయోగిస్తానని చెప్పారు. కుక్ కూడా అనేక సమస్యలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆపిల్‌కు సంబంధించిన ఉత్పత్తులకు చాలా ఆలోచనాత్మకమైన ప్రాతిపదికన కొత్త ఏఐ ఫీచర్లు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏఐకు సంబంధించిన పరివర్తన శక్తి, వాగ్దానాన్ని విశ్వసిస్తున్నట్లు యాపిల్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సేవల ఏకీకరణతో సహా ఆపిల్ ఐఓఎస్ 18, దాని కొత్త ఏఐ ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీ  ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 10న ప్రత్యేక ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి