
ఏఐ లో ఒక సంచలనంగా మారిన చాట్ జీపీటీ ఇప్పుడు పేమెంట్స్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇకపై చాట్ జీపీటీ ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా ఓపెన్‌ఏఐ సంస్థ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రేజర్‌పే సంయుక్తంగా కలిసి ఈ విషయంపై ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
మనదేశంలో డిజిటల్ పేమెంట్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు కనెక్ట్ చేసే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. చాట్‌బోట్ ఇంటర్‌ఫేస్ ద్వారా యూపీఐ యూజర్లు.. డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఏఐ టూల్స్ ఆధారంగా జరిపే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ సురక్షితంగా ఉండే విధంగా ఓపెన్ ఏఐ ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తుంది.
అయితే ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్ట్ గా ఉంది. ఈ మోడల్ సక్సెస్ అయితే పూర్తిస్థాయిలో ఏఐ పేమెంట్స్ అందుబాటులోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగస్వాములుగా చేరాయి. ప్రస్తుతం యూపీఐ ద్వారా ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆన్‌లైన్ షాపింగ్ లో ఇకపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి