Social Media: వాట్సప్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. అమల్లోకి కొత్త రూల్

మీరు వాట్సప్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారా..? అయితే ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోవాల్సిందే. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు భారత కమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అలంటి యాప్స్ వాడాలంటే దానిని తప్పనిసరి చేసింది. అదేంటి అంటే..

Social Media: వాట్సప్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. అమల్లోకి కొత్త రూల్
Whats App

Updated on: Nov 29, 2025 | 5:29 PM

Social Media Apps: ఇక నుంచి వాట్సప్, టెలిగ్రామ్, స్పాప్ ఛాట్ లాంటి సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్ వాడాలంటే మీ ఫోన్‌లో సిమ్ వాడాల్సిందే. ఇప్పటివరకు ఒక ఫోన్‌లో సిమ్ ఉన్నా.. ఆ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వేరే ఫోన్‌లో కూడా యాప్స్ వాడేందుకు వీలవుతుంది. కానీ ఇక నుంచి అలాంటి అవకాశం ఉండదు. సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే తప్పనిసరిగా ఫోన్‌లో సిమ్ ఉండేలా భారత టెలికమ్యూనికేషన్ విభాగం నిబంధనలు తెచ్చింది. ఈ మేరకు టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సిమ్ లేకుండా వినియోగదారులకు సేవలు అందించే విధానానికి స్వస్తి పలకాలని తెలిపింది. ఇందుకోసం టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు, 2025ను నోటిఫై చేసింది.

వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్‌ వంటి సంస్థలకు టెలికమ్యూనికేషన్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్ వాలిడేషన్ కోసం మొబైల్ నంబర్‌లను ఉపయోగించే కొన్ని యాప్‌లు సిమ్ లేనప్పుడు కూడా యాక్సెస్‌ను అనుమతిస్తున్నాయి.సైబర్ మోసాలు చేసేవారికి ఇది ఉయోగకరంగా ఉంటుందని కేంద్రం గుర్తించింది. దీనికి చెక్ పెట్టేందుకు సిమ్ బైండింగ్‌ ఉండేలా చూసుకోవాలని సోషల్ మీడియా యాప్స్‌కు ఆదేశాలిచ్చింది. దీని వల్ల సోషల్ మీడియాలో జరిగే మోసాలు,సైబర్ నేరాలు తగ్గిపోతాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకులు, యూపీఐ యాప్‌లు సిమ్ బైండింగ్ ప్రక్రియను చేపడుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు సోషల్ మీడియా యాప్‌లు కూడా సిమ్ బైండింగ్ చేపట్టాల్సి ఉంటుంది.

ప్రస్తుతం యాప్స్ ఒకసారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు సిమ్ కార్డు ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ అడుగుతున్నాయి. ఆ తర్వాత సిమ్ కార్డు తీసివేసినా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోలుగుతున్నారు. సైబర్ నేరగాళ్లు వేరే ప్రాంతాల్లో ఉండి కూడా దీని ద్వారా మోసం చేయకలులగుతున్నారు. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడోక్కడో ఉండి మన అకౌంట్లోకి డబ్బులు కాజేస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను అందుకోసం ఉపయోగించుకుంటున్నారు. దీనిని గమనించిన కేంద్రం.. నేరాలను అరికట్టేందుకు నిబంధనలు కఠినతరం చేస్తోంది.