టీవీలలో వివిధ కార్యక్రమాలను, పాటలను వీక్షించేటప్పుడు సౌండ్ అనేది చాలా కీలకం. అది సక్రమంగా ఉన్నప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించగలం. నేడు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన అనేక టీవీలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వాటిలో ప్రోగ్రామ్ లను చూసే సమయంలో సౌండ్ మరింత స్పష్టంగా ఉండాలంటే హోమ్ థియేటర్లు చాలా అవసరం. చాలా ఇళ్లలో నేటి ఇవి సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో సరికొత్త డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అత్యుత్తమ 5.1 హోమ్ థియేటర్ ఆకట్టుకుంటున్నాయి. వాటిపై దాదాపు 73 శాతం వరకూ అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులను ప్రకటించారు. అమెజాన్ సేల్ లో సోనీ, గోవో, జెబ్రోనిక్స్ తదితర ప్రముఖ బ్రాండ్ల టాప్ నాచ్ 5.1 డాల్బీ అట్మోస్ హోమ్ థియేటర్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు మొదటి ఆర్డర్‌ను ఉచితంగా ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. ఎస్ బీఐ క్రెడిట్ కార్డుదారులకు రూ.3,000 వరకూ తక్షణ తగ్గింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో హోమ్ థియేటర్ల ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
సినిమాలు, సీరియళ్లు, పాటలను వీక్షించేటప్పుడు మంచి సౌండ్ కావాలనుకునేవారికి ఈ హోమ్ థియేటర్ చాలా బాగుంటుంది. అమెజాన్ సేల్ లో దాదాపు 71 శాతం తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం బ్లాక్ సౌండ్ సిస్టమ్ లో శక్తివంతమైన 550డబ్ల్యూ డాల్బీ ఆడియో అవుట్‌పుట్‌ను ఉంది. 5.1 ఛానల్ సెటప్‌లో వైర్‌లెస్ సబ్ వూఫర్, మూడు డైనమిక్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. బ్లూటూత్ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ నుంచి సంగీతాన్ని సులభంగా స్ట్రీమ్ చేయవచ్చు. ఈ హోమ్ థియేటర్ రూ. 15,999కు అందుబాటులో ఉంది.
గోవో గోసరౌండ్ 990 డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ ను 72 శాతం తగ్గింపు ధరకు అందజేస్తున్నారు. దీనిలో 525 డబ్ల్యూ అవుట్‌పుట్, 6.5 వైర్‌లెస్ సబ్ వూఫర్, శాటిలైట్ స్పీకర్ ఉన్నాయి. హెచ్ డీఎంఐ, ఆప్టికల్, యాక్స్, యూఎస్ బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అలాగే మూడు ఈక్వలైజర్ మోడ్‌లు, సులభమైన నావిగేషన్ కోసం ఎల్ ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా థియేటర్ లో చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు రూ.1,049.90 వరకూ అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ హోమ్ థియేటర్ రూ.10,499కు అందుబాటులో ఉంది.
అత్యుత్తమ సౌండ్ సిస్టమ్ కావాలనుకునే వారికి సోనీ హెచ్ టీ – ఎస్20ఆర్ రియల్ 5.1 డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అమెజాన్ సేల్ లో దీనిపై 33 శాతం తగ్గింపు ఇచ్చారు. 400 డబ్ల్యూ పవర్ అవుట్‌పుట్ కారణంగా సినిమాలు, షోలను చూసినప్పుడు మీకు వాటి మధ్యలో ఉన్న అనుభూతి కలుగుంది. దీనికి వివిధ రకాల పరికరాలను బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేయవచ్చు. అదనంగా యూఎస్ బీ పోర్ట్ మెమరీ స్టిక్ నుంచి సంగీతాన్ని ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంది. కేవలం రూ. 775 నుంచి ఈఎంఐ ఎంపికలు ప్రారంభమవుతాయి. సోనీ హోమ్ థియేటర్ ధర రూ.15,989.
జెబ్రోనిక్స్ జ్యూక్ బార్ 9750 ప్రో 5.1.2 హోమ్ థియేటర్ పై దాదాపు 73 శాతం తగ్గింపు లభిస్తోంది. డాల్బీ అట్మోస్, ఈఏఆర్సీ మద్దతుతో 525 వాట్ల అవుట్‌పుట్, డీప్ బాస్‌తో క్రిస్టల్ క్లియర్ ఆడియో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సౌండ్‌బార్‌లో ట్రిపుల్ ఫ్రంట్ ఫేసింగ్, డ్యూయల్ టాప్-ఫైరింగ్, వైర్‌లెస్ రియర్ శాటిలైట్ డ్రైవర్లు ఉన్నాయి. అమెజాన్ పే రివార్డ్‌లతో పాటు ఆఫర్ సమయంలో కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు చక్కగా సరిపోతుంది. ఈ హోమ్ థియేటర్ రూ.15,999కు అందుబాటులో ఉంది.
మంచి ఆడియోతో కార్యక్రమాలను వీక్షించాలనుకునే వారికి జేబీఎల్ బార్ 500 ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్/ వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో కూడిన హోమ్ థియేటర్ చాలా బాగుంటుంది. 590 వాట్ల అవుట్‌పుట్ తో సినిమాలు, పాటలు, సంగీతం, గేమ్ లను చక్కగా ఆస్వాదించవచ్చు. దీనిలోని జేబీఎల్ మల్టీభీమ్ సాంకేతికతతో గదిలోని ప్రతి మూలకు అద్భుతమైన ధ్వని చేరుతుంది. డాల్బీ టెక్నాలజీ, బ్లూటూత్, వైఫై, ఆప్టికల్ ఇన్‌పుట్ వస్తున్న ఈ హోమ్ థియేటర్ కు వివిధ పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఎంపికతో అందుబాటులో ఉంది. దీని ధర రూ.49,998.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..