BSNL: కస్టమర్లకు బిగ్ షాక్.. ఆ రీచార్జ్ ప్లాన్‌ గడువు తగ్గించిన బీఎస్ఎన్ఎల్..

కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బిగ్ షాక్ ఇచ్చింది. రూ.197 రీచార్జ్‌లో కీలక మార్పులు చేసింది. ప్లాన్ గడువు తగ్గించడంతో పాటు వాయిస్ కాల్స్‌ను సైతం పరిమితం చేసింది. ఈ నిర్ణయంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రయోజనాలను తగ్గించినప్పటికీ.. 2024-25 నాలుగవ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ.280 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

BSNL: కస్టమర్లకు బిగ్ షాక్.. ఆ రీచార్జ్ ప్లాన్‌ గడువు తగ్గించిన బీఎస్ఎన్ఎల్..
Bsnl Recharge Plan

Updated on: Jul 25, 2025 | 5:59 PM

గత కొంత కాలంగా బీఎస్ఎన్ఎల్ మంచి మంచి ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలు పెరగడంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. అతి తక్కువ ధరలు ఉండడమే దానికి కారణం. కానీ బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఫాస్ట్‌గా ఉండకపోవడం మైనస్. సిగ్నల్ కొన్ని ప్రాంతాల్లోనే బాగుంటే.. చాలా ప్రాంతాల్లో నెట్ అందుబాటులో ఉండదు. ఈ క్రమంలోనే తన నెట్‌వర్క్‌ను మరింత స్ట్రాంగ్ చేసే ప్రయత్నాల్లో సంస్థ నిమగ్నమైంది . ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ రూ.197 రీఛార్జ్ ప్లాన్‌కు సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, 15 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, 15రోజుల పాటు రోజు 100 ఎస్ఎమ్ఎస్‌లు, 70 రోజుల పాటు ఇన్‌కమింగ్ సేవలు లభించేవి. కానీ కంపెనీ వీటిని తగ్గించింది.

70 రోజుల కాలవ్యవధిని నుండి 54 రోజులకు తగ్గించింది. అంతేకాకుండా 300 నిమిషాల వాయిస్ కాల్స్, 4GB డేటా, 100ఎస్ఎమ్ఎస్‌లకు పరిమితం చేసింది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వినియోగదారులకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది.. కానీ 40 Kbps వేగం మాత్రమే వస్తుంది. రోజువారీ ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ను తగ్గించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమంగా ఉండేది. కానీ వ్యాలిడిటీని తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది.

ఈ ప్లాన్ ప్రయోజనాలను తగ్గించినప్పటికీ.. 2024-25 నాల్గవ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ లాభం రూ. 280 కోట్లుగా ఉంది. మౌలిక సదుపాయాలలో సంస్థ భారీగా పెట్టుబడి పెడుతోంది. 2025 నాలుగవ త్రైమాసికంలో నెట్‌వర్క్ టవర్లు, సంబంధిత పరికరాల కోసం రూ.15,324 కోట్లు ఖర్చు చేసింది. స్పెక్ట్రమ్ కోసం రూ.10,698 కోట్లు ఖర్చు చేసింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…